పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కథలు - గాథలు

తరువాత నిజాము ఇంగ్లీషువారికి సైనిక ఖర్చులక్రింద యివ్వవలసివచ్చిన సొమ్ముక్రింద రాయలసీమలోని బళ్లారికడపజిల్లాలనూ, కర్నూలు జిల్లాలోని కంభము, మర్కాపురము, కోయిలకుంట్ల, పత్తికొండ, అనే నాలుగు తాలూకాలనూ, 1800 వ సంవత్సరంలో నిజాము ఇంగ్లీషు వారికి సమర్పించాడు. ఇవే దత్తమండలా లని ప్రఖ్యాతి చెందినాయి కర్నూలుజిల్లాలో చేరిన మిగతా నాలుగు తాలూకాలు అనగా రామళ్ళకోట, నందికొటుకూరు, నంద్యాల, శిరివెళ్ళ, తాలూకాలు కర్నూలు నవాబురాజ్యంలోనే యున్నాయి. ఈ సందర్భంలో కర్నూలు నవాబు సాలుకు ఒకలక్షరూపాయలు కప్పం చెల్లించేపద్ధతిమీద అతని రాజ్యం అతనికే వుండనిచ్చారు.

పైన చెప్పినట్లు నిజాముగారివల్ల ఇంగ్లీషువారికిచ్చిన దత్తమండలాలనె బళ్ళారి కడప కర్నూలు జిల్లాల భాగాలను పరిపాలించడానికి తామస్ మన్రోగారిని నియమించారు. ఆ జిల్లాలలో పాలెగాళ్లు కొందరు దేశంలో అల్లరి సాగించగా క్యాంబెల్ అనే సేనాధిపతి వారిని అణచివేశాడు. అయితే మళ్ళీ కొద్దిరోజులలోనే దివాకరనాయకుడనే యతడు పుల్లల చెరువుగ్రామాన్ని తగలబెట్టి మార్కాపురం కచ్చేరీలో నున్న ఖజానాను దోచుకున్నాడు. అప్పుడు అక్కడ సబు కలెక్టరుగా నున్న గ్రీముదొరగారున్నూ, తాశిల్దారుగానున్న నరహరిరావుగారున్నూ, అతనిని పట్టుకొవడానికి చాలా ప్రయత్నాలు చేశారు గాని లాభంలేకపోయింది.

1800 లో చెన్నపట్నానికి మింటోగారు గవర్నరుగా నుండగా ఇంగ్లీషువారికి మహారాష్ట్రులతో యుద్ధంవచ్చింది. అప్పుడు కర్నూలు నవాబు ఆలూఫ్ ఖాను తన్మతమ్ముడికి కొంత సైన్యమిచ్చి ఇంగ్లీషువారికి సహాయముగా పంపించాడు. ఆలూఫ్ ఖానుగారికి ఆరుగురు కొమాళ్ళు, అందులో కడసారి కొమరుడైన గులాంరసూలుఖానుమీద ఆయనకు చాలాప్రేమ, అందువల్ల తనస్థానే అతణ్ని నవాబుగా అంగీకరించవలసిదని మింటోవారిని ప్రార్ధించి ఆ ప్రకారము ఉత్తర్వులు పొందినాడు. అంతట గులాం రసూలుఖాను కర్నూలు నవాబు అయినాడు. అయితే మళ్ళీ