Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాకిటి కావలి తిమ్మన

121

ఇత డింకా కొన్ని గ్రామాల ఆదాయంవల్ల వచ్చే సొమ్మునుకూడా దేవుడికి సమర్పించాడు అందువల్ల ఇతడొక శ్రీమంతుడై యుంటాడనడానికి సందేహం లేదు.

'క ట్టి క ' తి మ్మ న

జిల్లేళ్ల బసవనాయకరు కొమారూడైన తమ్మునాయకరు అనే యతడు కృష్ణదేవరాయలవారి 'కట్టిక ' అనగా వెండిబెత్తమును పట్టుకొని వుండే వేత్రధరుడు. ఇదియొక రాజలాంఛనము అతడొక దళవాయి అనిన్నీ, ఈయనకు 'దాడినేని ' అనే బిరుదుకూడా వుండేదనిన్నీ అతడు తిరుపతి వెంకటేశ్వరస్వామి వారికి నిత్యనైవేద్యము నిమిత్తము 1200 నార్పణములు సమర్పించి నప్పుడు క్రీ.శ.1513 వ సంవత్సరములో చెక్కించిన శాసనములో వ్రాయబడి వున్నది. ఈశాసనమే తెలుగులోకూడా క్లుప్తముగా వ్రాయబడివుంది. అందులో ఈకట్టిక తిమ్మన్న అనుసంధానం రామానుజయ్యగారి శిష్యుడనిన్నీ, అతని పేరు కట్టిక దాడినేని దళవాయి తిమ్మయ్య యనిన్నీ వుదాహరించబడి వున్నది. శత్రువుల మీదికి వెడలి జయించినందువల్లనే 'దాడినేని ' అనే బిరుదు ఇతనికి వచ్చివుంటుంది.

'విద్వత్సభారాయరంజక ' శ్రీరంగరాజు

కృష్ణదేవరాయలవారి పూర్వుల కాలం నుంచీ విజయనగరరాజ భవనంలో ఒక నాటకశాల వుండేది. కృష్ణదేవరాయలవారి కాలంలో ఒక నాట్యశాల, ఒక నృత్యశాలకూడావుండేవి. రాయలవారు తమ ఆస్థానంలో సాహిత్యవిద్వ్గాంసులను పొషిస్తూ సదా విద్యాగోష్ఠిలో కాలక్షేపం చేస్తూ 'విద్వత్ సభారాయ' లనే బిరుదు వహించారు. నృత్యముచేసిన సంగీతము పాడి అయనను రంజించే ఆటపాటకుల మేళ మొకటి యుండేది. ఈ మేళానికి నాయకుడు తిరుమల నాధుని కుమారుడైన శ్రీరంగరాజు. అతనికి 'విద్వత్ సభరాయరంజక' అనే బిరుదు ఉండేది. రాయల వారాయనకు గొప్పజాగీరులిచ్చారు. అందులో ఎర్లంపూడి అనే గ్రామాన్ని ఈ శ్రీరంగరాజు క్రీ.శ.1514 లో శ్రీవెంకటేశ్వరుల వారికి సమర్పించాడు.