పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కథలు - గాథలు

ఈ శ్రీరంగరాజు కొమర్తెయైన రంజకం కుప్పాయి అనే కుప్పసాని క్రీ.శ.1512 లో చేసిన దానం ఒకటి కనబడుతూవుంది. ఈ కుప్పాయికి తిరుమలమ్మ, ముద్దుకుప్పాయి అనే ఇద్దరు కుమర్తెలుండేవారు. తిరుమలమ్మ స్వామివారికి శా.శ.1439 ఈశ్వర సం (క్రీ.శ.1517)లో 3000 నార్పణములు సమర్పించినట్లు వ్రాయబడిన శాసనం తెలుగు ప్రతిలో ఆవిడ శ్రీరంగరాజు మనుమరాలనిన్నీ, కుప్పమ్మకుమార్తెననిన్నీ వ్రాయించింది.

కుప్పాయి రెండవ కొమర్తె ముద్దుకుప్పాయి మొదట విజయనగర చక్రవరియైన అచ్యుత దేవరాయల అంత:పురపరిచారికగా వుంటూవుండి ఆయన ఆజ్ఞప్రకారము తిరుపతి వెంకటేశ్వరస్వామివారి సేవ చేయడానికి వచ్చినట్లున్నూ, గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి ప్రతిరోజూ ఆవిడకు తినడానికి ప్రసాదం యిస్తూవున్నట్లున్నూ శా.శ.1453 ఖర సంవత్సరం(క్రీ.శ.6-6-1531) శాసనంలో వివరింపబడివున్నది. ఈశాసనంలో శ్రీరంగరాజు కొమార్తెయున్నూ ముద్దుకుప్పాయితల్లిన్నీ అయిన కుప్పసానికీకూడా "విధ్యుత్సభారాయరంజకం" అనే బిరుదు వుండినట్లు చెప్పబడివున్నది.

ఇలాగ విజయనగర చక్రవర్తుల సేవను చేసే స్త్రీ పురుషులలో గొప్ప వంశాలవారూ, శ్రీమంతులూ అనేకు లుండేవారని తిరుపతి దేవస్థానములోనున్న శాసనాలవల్ల తెలుస్తూవున్నది."[1]

తి మ్మ శ బ్ద వి చా ర ము

మన తెలుగు దేశంలొ తిమ్మ, తిమ్మడు, తిమ్మన్న, తిమ్మప్ప, తిమ్మకవి, తిమ్మనృపతి, తిమ్మమంత్రి, తిమ్మయ్య, తిమ్మరాజు, తిమ్మాజి, తిమ్మశౌరి, తిమ్మశెట్తి, తిమ్మక్క, తిమ్మాయమ్మ, తిమ్మమ్మ,తిమ్మాంబ, తిమ్మాజమ్మ అనే స్త్రీ పురుషుల పేర్లేగాక తిమ్మాపురం, తిమ్మసముద్రము మొదలైన స్థలవాచకములున్నూ, తిమ్మిని బ్రహ్మిని చేయడము రమ్మన్నారు తిమ్మన్న బంతికి, తిండికి


1

  1. .(Tirupati Devasthanam Epigraphical Report by Sadhu Subrahmanyam, pp.199. 207)