కాశీమసీదులో శివలింగం
109
ఒకశివాలయాన్ని పడగొట్టి మశీదుకట్టడంలో ఆదేవాలయంలో నుండిన అందమైన గొప్పశివలింగాన్ని అలాగే అట్టే వుండనిచ్చి మశీదు కట్టారు. ఈ శివలింగం నలభై అడుగుల ఎత్తు ఏకాండీ శిల. దీనిమీద అందమైన చెక్కడపు పని వుండేది. ఇది పూర్వం రెండురెట్లు ఎత్తువుండేదనిన్ని, క్రమక్రమంగా భూమిలోకి దిగబడిపోతూ వున్నదనిన్నీ, అది భూమిమట్టానికి రాగానే అన్నికులాలూ ఒక్కటైపోతాయనిన్నీ ప్రజలు అనుకుంటూ వుండేవారు.
ఈ శివలింగం మశీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతిపవిత్రంగా ఎంచి, మశీదు అధికారులను మంచిచేసుకొని, లోపలికి వెళ్లి దీన్ని పూజిస్తూవుండేవారు. భక్తులు ఇచ్చేకానుకలలో సగంవంతు తమకు చెల్లేపద్దతిని మశీదువారు దీనికి వప్పుకున్నారు.
ఈ శివలింగం చుట్టూవున్న చెక్కడపు పని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పైనచెప్పిన కారణంవల్ల దానిని ఏమీ చేయకుండా వుంచారు. ఇలాగ ఒక వందసంవత్సరాలు ఈ శివలింగానికి మశీదులోనే అర్చనలు జరిగాయి.
ఇలా వుండగా ఒకమాటు మొహరంపండుగ ఊరేగింపుల సందర్బంలో హిందువులకూ, మహమ్మదీయులకూ తగాదాలు వచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మతకలహంగా పరిణమించింది. ముసల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతిపవిత్రంగా పూజించే యీశివలింగాన్ని పగులగొట్టారు. అంతట హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒకమశీదును తగులబెట్టారు. దానిమీద తురకలు వీరావేశంతో ఒక ఆవును చంపి, దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయందగ్గర గంగానదీజలంకన్నా అతిపవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానములు చేసే "ఇననకూప"మనే ఒక పురాతనమైన నూతిలో కలిపారు.
అంతట కత్తి పట్టగల ప్రతి హిందువూ రోషవేశంతో కత్తులూ కఠారులూ పుచ్చుకుని కనబడిన తురకవాడిపై బడి దౌర్జన్యం