Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కథలు - గాథలు

చేయసాగారు. కాశీలో హిందువులే బహుసంఖ్యాకులైనందువల్ల తురకలనురూపుమాపుతారేమో నన్నంత భయం కలిగింది.

కుంఫినీ అధికారులు శిపాయీలను బయటికితెఛ్ఛి నిలపకపోతే ఇటుసూర్యుడటు పోయేలోపల ఊళ్ళో మశీదులనన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే. అయితే, హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి శిపాయీ లెంతవరకు తోడ్పడతారో అనేదికూడా అనుమానాస్పదమైన విషయంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే, అక్కడి శిపాయీలలో చాలామంది హిందువులు, సగంమంది బ్రాహ్మణులే. నిజంగా వాళ్ళమనసులో సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయుల రక్తాన్ని చూరగొనాలనే వుందని చెప్పాలి.

ఈ తురకలపైకి పోతూవున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులూ, యోగులూ, గోసాయీలూ, బైరాగులూ, మొదలైన సనాతన ధర్మపరులే వీళ్ళు తమవంటినిండా విభూతి పూసికొని మొగాలపైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తలవెండ్రుకలు విరబోసికొని జందములు చేతపట్టు కొని తమతోడి హిందువులతోనూ దేవుళ్ళతోనూ యుద్ధంచెయ్యబూనిన వారిని శాపనార్ధాలు పెడుతూ వీరంతా ముందువరుసలోనే వున్నారు. అయినప్పటికి శిపాయీలు చలించలేదు. తాము ఎవరి వుప్పు తింటున్నారో ఆ కంపెనీ వారి వుత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధువులు ఎదురైనాసరే తుపాకీ పేల్చడానికి ఒట్టుపెట్టుకొని సైన్యపు కొలువులో చేరిన ఈ శిపాయీలు అవసరమైతే బ్రాహ్మడిపైనకూడా తుపాకీ పేల్చడానికి సంసిద్ధులైనారు.

పైన చెప్పిన శివలింగం వుండే మశీదు ద్వారందగ్గర కావలి కాస్తూవున్న శిపాయీలలో ఒకడు అక్కడ కిందపడివున్న శివలింగాన్ని చూసి ఇలాగాన్నాడు. "అయ్యా! మనమెన్నడూ అనుకోనిసంగతిని చూశాము. శివలింగంశిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంక కొద్దికాలంలోనే మన మందరమూ ఒకేకులంవాళ్ళ మైపోతాము. అప్పుడు మనమతం