చెన్నపట్నం గవర్నరు దుర్గతి
103
అతనిని నియమించాలని అన్నారు. దీనిని గురించి కార్యాలోచన సభ యొక్క సమావేశాలలో అతి తీవ్రమైన చర్చలు జరిగినవి. చివరకు అధిక సంఖ్యాక సభ్యులు గవర్నరుగారి అభిప్రాయాన్ని త్రోసిపుచ్చారు. అంతతా వారు పేర్కొన్న అభ్యర్హిని ఆపదవికి నియమించినట్లు జారీ చేయవలసిన అధికార పత్రముమీద గవర్నరు సంతకం చెయ్యడానికి నిరాకరించాడు. ఈ తగాదా చాలా తీవ్రరూపం దాల్చింది. గవర్నరును సభలో ప్రతిఘటిస్తూవున్న సభ్యులలో బ్రూకు స్ట్రాటన్ అనే ఇద్దరు సభ్యులు చాలా దురుసుగా ప్రవర్తించినందువల్ల గవర్నరు వారిపైన కోపించి వారు ప్రభుత్వ ద్రోహము తలపెట్టినారనే నేరమును మోపునాడు. అలాంటి నేరము మోపబడిన సభ్యులు సభలో పాల్గొనడానికి వీలులేదని శాస్త్రవిధి యున్నందువల్ల వారిని సభలోకి రాకుండా చేసి తక్కిన సభ్యుల సహాయంతో వాళ్ల సభ్యత్వం బర్తరపు చేసినట్లు గవర్నరు తీర్మానింప జేశారు. అంతట కార్యాలోచన సభలో పూర్వం అధిక సంఖ్యాకులుగా నుండిన సభ్యులందరూ ఏకమై గవర్నరుకు వ్యతిరేక పక్షంగా ఏర్పడి అతనిని గురించి పైయధికారులకు ఒకపితూరీ వ్రాసి గవర్నరును కార్యాలోచన సభలో పలుకుబడి లేనందువల్ల అధిక సంఖ్యాకులైన తామే ప్రభుత్వాధికారాలను చలాయించుటకు అర్హులమని ప్రకటిందారు. అప్పుడు గవర్నరున్నూ అతని స్నేహితులున్నూ పితూరీదారులైన కార్యాలోచన సభ్యులందరినీ సభ్యత్యంలో నుంచి తొలగించినట్లు ప్రకటించి వారిని పట్టుకుని అరెస్టు చేసి సైనిక శాసనంకింద శిక్షించవలసినదని చెన్నపట్నంలో సర్వసేనానిగా వున్న సర్ రాబర్టు ప్లెచర్ గార్ని కోరారు. అయితే ఈ సర్వసేనాని కూడా గవర్నరుకు వ్యతిరేక పక్షంలో చేరి వున్నందువల్ల అతడలాగ చేయక ఉపేక్షించాడు.
గవర్నరుగారిని ఖైదుచెయ్యడం
గవర్నరుకు వ్యతిరేక పక్షంగ నున్న సభ్యులకు గవర్నరు అలుసైపోయినాడు. అతడు తమర్ని అరెస్టు చేయించదలచి నందుకు శాస్తిగా తామే అతనిని పట్టుకుని నిర్భంధించడానికి వారు నిశ్చయించారు.