102
కథలు - గాథలు
కుందామంటే అతడు చాలా దుబారా మనిషి. సొమ్ము నిలువచేసే స్వభావం కల వాడు కాదు. నవాబుగారుగాని ఇతరులుగాని నీకు బాకీ వున్నట్లు నీదగ్గర దాఖలా లేమైనా వుంటే చూపించ వలసిందని గవర్నరుగారు అడిగితే అతడేమీ చూపలేక పోయాడు. గవర్నరు గారి కార్యాలోచన సభ్యులలో బహుసంఖ్యాకులు కూడా మొదట బెన్ ఫీల్డు చెప్పిన మాటలను నమ్మలేదు. తరువాత మళ్లీ అతడేమి మాయోపాయాలు చేశాడోగాని త్వరలోనే కార్యాలోచన సభ్యుల మనస్సులు మారి బహుసంఖ్యాకులు మళ్ళీ తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఈవ్యవహారాన్ని తిరుగదోడి తంజావూరు కర్నాటక నవాబు స్వాధీనంలో వుండగా ఆరాజ్యాలలో భూములమీద పండిన పంట యావత్తూ బెన్ ఫీల్డుకే హక్కు గల ఆస్తి అని తీర్మానించారు! పైగా బెన్ ఫీల్డు బాకీలనేవి తంజావూరు రాజ్యాదాయంపైన బద్ధతచేయబడవలసిన పబ్లికు ఋణ మనే అభిప్రాయాన్నికూడా వెలిబుచ్చి ఆ రాజ్యములోని భూములమీద నున్న పంటను అతని వశంచెయ్యడానికి చెన్నపట్నం ప్రభుత్వం వారు తగు సహాయం చెయ్యాలని కూడా నిశ్చయించారు.
గవర్నరుగారికి కార్యాలోచన సభ్యులకూ తగాదా
గవర్నరు గారికి చాలా అన్యాయమని తోచింది. అంతట పిగట్టుగారు తన కార్యాలోచన సభ్యుల యభిప్రాయాన్ని ప్రతిఘటించారు. గవర్నరుగారికీ కార్యాలోచన సభ్యులకూ ఘర్షణ జరిగింది. అంతట గవర్నరుగారి కార్యాలోచన సభలో బెన్ ఫీల్డు పక్షం వహించిన సభ్యులు గవర్నరుమీద నీర్ష్యవహించి ఇతర విషయాలలో అతని అధికారాన్ని తృణీకరించడం ప్రారంభించారు.
ఇంతలో తంజావూరు రాజు దర్బారులో ఒక ఇంగ్లీషు ప్రతినిధిని నియమించ వలసి వచ్చింది. ఆ సందర్భంలోకూడా గవర్నరుగారికీ కార్యాలోచన సభలోని అధిక సంఖ్యాక సభ్యులకూ అభిప్రాయ భేదం వచ్చింది. గవర్నరుగారీ పదవికి రస్సెల్ అనె అతణ్ని నియమించాలని అంటే సభ్యులు బెన్ ఫీల్డుకి అనుకూలంగ ఉండే స్టూవార్డు అనే