పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


వాడికి ఫ్యాక్టరు (Factor) గా ప్రమోషను యిచ్చారు. 1790 లో ఇతడు సీనియరుమర్చెంటు హోదాను, గంజాం అసిస్టెంటు రెసిడెంటుపదవిని పొందినాడు. భారతదేశంలో ఎక్కడ చూసినా వరహాల చెట్లువుండిన రోజులు - అవి. ఆచెట్లను ఆశ్రయించుకొని దులిపినకొద్దీ బంగారువర్షం కురిసేది. తక్కిన దొరల లాగునే ఈ స్నాడ్ గ్రాసుకూడా వుద్యోగరీత్యా తనకు అబ్బిన అవకాశాన్ని వృధాపోనివ్వకుండా ఆ వరహాలచెట్టును గట్టిగా పట్టుకొని దులపడం ప్రారంభించాడు. ఇతడు రెసిడెంటుగా వచ్చిన రెండుసంవత్సరాలలో గంజాంలొ కఱవు వచ్చించి ఈకఱవు లో ఇతడు తెలివిగా పనిచేశాడు. జమీందార్లను అదుపులో వుంచాడు. ఆ కాలంలో ఇతడు తిండిలేక మాడుతూన్న వాళ్లచేత పనులు చేయించి సర్కారు డబ్బులతో వారికి గంజికూడు పెట్టించాడు. ఇతడు వాళ్లచేత కట్టించిన బిల్డింగులలో గంజాం పట్టణానికి పదిమైళ్లలో వున్న రంభలో చిలకసముద్రంయొక్క ఒడ్డును ఆనుకొని ఇరవైవేల నవరసలుపెట్టి కట్టిన సుందర మైన భవంతి ఒకటి. ఇది అతనిసొంతం. ఈ భవనం అంటే అతనికి అతిప్రీతి. దానిలోనే ఇతదు కాపురం వుంటువుండేవాడు. అది ఇప్పటికీ వున్నది. అప్పుడు చెన్నపట్నం గవర్నరుల్ స్దర్ చార్లెస్ ఓక్లే, కఱవుకోసం అని చెప్పి స్నాడ్ గ్రాసు ఖర్చుపెట్తిన సొమ్ము చాలా ఎక్కువగా వున్నదని విమర్శించాడు. ఈ సంగతి ఏమిటో కనుక్కో వాలనిన్నీ, కుంపినీవారి రెవెన్యూ ఉద్యోగులందరూ చేయవలనట్లు పార్లమెంటువారు నిర్ణయించిన ప్రమాణం ఇతనివల్ల తీసుకో గలందులకున్నూ ఇతన్ని చెన్నపట్నం రమ్మన్నారు.

ఇతడు గంజాంనుంచి అవతిలికి అడుగు పెట్టడంతోటే అక్కడి జమీందార్లు చాలామంది ఇతని దువషీ (ద్విభాషి)అయిన గొపాలకృష్ణమ్మకు తాము దఫాలవారీగా చాలామొత్తాలు చెల్లించినా మనిన్నీ, దానికి అతడు రశీదులు యివ్వలేదనిన్నీ ఫిర్యాదుచేశారు. దీనివల్ల స్నాడ్ గ్రాసు తన 'ద్విభాషికి ' తగని చనవూ అధికారమూ ఇచ్చాడనిన్నీ, అతడు అధికారం దుర్వినియోగం చేసి లాభం పొందినాడనిన్నీ, అతడు అధికారం దుర్వినియోగం చేసి లాభం పొందినాడనిన్నీ, బయలు