కథలు - గాథలు
చిలకసముద్రం కలెక్టరు
[ఇదికల్పికధకాదు. నూరు సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగినకధ. గంజాంజిల్లాలో ఇప్పటికీ ముసలివాళ్లు ఈ కధ చెప్పుకుంటారు. చాలామంది పాశ్చాత్యగ్రంధకర్తలు దీనిని తమ పుస్తకాలలోనికి యెక్కించారు. సర్ చార్లెస్ గారు "మెమోరీస్ ఆఫ్ మెడ్రాస్" అనే పుస్తకంలో దీనినిగురించి ఒక ప్రకరణం వ్రాశారు. నేను వ్రాస్తూవున్న సంగతులలో చాలాభాగం వారి గ్రంధానికి అనువాదం]
గంజాంజిల్లలో చిలకసముద్రం అనే మహాసరస్సు ఒకటి ఉన్నది. ఇది 44 మైళ్ళు పొదుగున బంగాళాఖాతానికి అనుకునిఉన్నది. సముద్రానికి దీనికీ 200 గజాలు వెడల్పుగల ఇసుకపర్ర మాత్రమే అడ్డం. ఇది సముద్రభాగమే అని చెప్పవచ్చును. డిశంబరు నుంచి జూన్ వరకూ నీళ్ళు ఉప్పగా ఉంటాయి. వర్షాకాలంలో మాత్రం తియ్యగా ఉంటాయి. ఈ సరస్సుయొక్క లోతు మూడుమొదలు ఐదు అడుగులు ఉంటుంది. ఎక్కడా ఆరుడుగులు దాటదు. దీనికి దక్షిణాన, పడమర, చిన్న చిన్న ఱాతికొండలు నీటిలోకి చొచ్చుకొని లంకల్లాగు ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో ఒకదానికి బ్రేక్ ఫాస్టు ఐలెండు (Break-fast Island) అనిపేరు. ఈ సరస్సులో మధ్య కళ్ళికోట రాజాగారి భవనం ఒకటి ఉన్నది. ఇండియా దేశానికి వైస్రాయిగా వుండిన కర్జనుప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు "ఈ చోటునుంచి కనబడే దృశ్యం భారతదేశంలోని కల్లా సుందరమైనదిగా నాకు తోస్తూంది" అనిఅన్నాడట! మన కధ ఈ ప్రదేశానికి సంబంధించినదే!
మనకధానాయకుడి పేరు తామస్ స్నాడ్ గ్రాస్. ఇతను గేబ్రిగ్రాసు కొడుకు ఇతడు 1759 లో జన్మించాడు. తండ్రి ఇండియాలో కుంఫిణీవారి కొలువులో పనిచేశాడు. అతని ప్రాపకంవల్ల తామసుకుకూడా 1777 లో చెన్నపట్నం సెంట్ జార్జికోట పరిపాలన క్రింద ఒక రైటరుగిరీ (Writership) యిచ్చారు. 1782లో ఈ కుర్ర