పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ వ్యాఖ్యానం కూడా " శఠాత్ముఁడు మిమ్ముఁ బోచుతన్ " అనే వాక్యాన్ని విమర్శించిన ప్లే వుంటుంది. యిది " అబ్రవీ ” త్పాండిత్య పయ_క్త విమర్శనశైలి. పెద్దపాండిత్యం వుండి కూడా యింతకన్నా అధ్వాన్నంగా వ్యాఖ్యానించేవారున్నూ వుంటారు. కువిందుఁడు యిట్టివారిని గూర్చియ్యేవే “ కిం సౌరభం నై రిభ8 ” అని వాకుచ్చి యున్నాఁడు. అతణ్ణి సహృదయు లెల్లరూ ఆమోదిస్తారు. అంతేకాదు నమస్కరిస్తారు కూడాను. పరమానందయ్యగారి శిష్యులకథలలో వొక కథవుంది. అందులో వొక పండితుఁడు తన్ను • శుద్ధవెణ్ణిముండా కొడుకుగా • సమర్థించుకోవ డానికి కొంత పరిశము చేస్తాఁడు. అది ఆయన బావమఱఁది యిచ్చిన సర్టిఫికెట్టుగా చెప్పకుంటాడు. యీకథ పలువు రెఱిఁగిందే కనక స్పృశించి విడిచాను.

యతిపాసలు కూర్చినంతమాతంచేత, గణాలు పోగుచేసినంత మాత9ంచేత పయోజనం లేదని చాలామంది కవులు గానివారుకూడా తెలుసుకొన్నవారు వున్నారు. పద్యమే వ్రాయనక్క ఆలేదు, వ్యాకరణ యుక్తంగానే వాయ నక్కఱలేదు, ఒక్కొక్కరి వాఁతలో వొకానొక విధమైన జీవకళ వుంటుంది. దీనికి వుదాహరణం అందఱూ యెఱిఁగిందే వొక్కటి పదాహరిస్తాను. కృష్ణాపతికా సంపాదకులు ముట్నూరి కృష్ణా రావుగారు పండితులైతే క్రాక్రూ లేదుగా ని అయినప్పంటికీ లోకం లో పండి తులతోపాటు శిష్యులకు పఠనపాఠాలు చెప్పే పండితులు కారు. కవనం చెప్పడం చేత నౌతుందో కాదో గాని యెప్పడూ ఒక కందపద్యంకూడా చెప్పినట్లు లేదు. సంపాదకీయవ్యాసం ఆయన వాస్తే, వుంటుంది కదా, చెప్పేదేమిటి, ఆలంకారికులు చెప్పే వ్యంగ్యం వగయిరాలకు ఆయన సంపాదకీయ వ్యాసాలలో యెన్నో వుదాహరణంగా వుంటాయి. యేది కవిత్వమో, యేది కవిత్వం కాదో విమర్శించే నైపుణ్యం ఆయనకి వుంది గాని యెప్పడోకాని ఆయన ఆయా పస పెట్టుకోరు. తత్తథాస్తామ్.