పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ మ్మెర పో త నా మా త్యు డు 5

కూడదనిన్నీ అనవలసి వస్తుంది. అది యుక్తియుక్తమైనమాటే కనక శిరసావహించవలసిందే. కృతి యివ్వడమే కాదు; యే సుకృత కార్య మున్నూ కూడా ఫలాపేక్ష లేకుండా చేయడమే యుక్తమని శ్రీ కృష్ణ భగ వానులు గీతలో చెప్పివున్నారు. ( సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ) యిది అప్రస్తుతం కనక యింతతో దీన్ని ఆఁ పుతెను. కృతి యివ్వడం పోతన్నగారికి సుతరామున్నూ యిషం లేదు కనక ఆ మహామహుఁడు ఆ కాలంలో యెందరోమండలాధీశ్వరులు కృతి స్వీకారానికి సిద్ధంగా వున్నప్పటికి తన్ను నయా నా భయానా బలవంత పెట్టినప్పటికి లేశ మున్నూ లొంగక " పంచమే ఒహని షష్టేనా శాకం పచతి స్వే గృహే ఆనృణీ హ్యపరపేష్య: ” అనే వచనానుసారంగా కుటుంబపోషణ చేసు కుంటూ భగవదారాధనతో కాలాన్ని నెట్టినట్లు స్పష్టపడుతుంది. ఆ యీ సందర్భం కృత్యాదిని వున్న " శ్రీకైవల్యపదమ్ము చేరుటకునై చింతిం చెదన్ " అనేపద్యంవల్లనే స్పష్టపడుతుంది. ' కైవల్యపద" శబ్లానికి అర్థం సర్వశ్రేయస్సులనూ మించిన మోక్షమే అయినప్పటికీ ఆమోక్షం మనుష్యుడు జీవించివుండఁగా లభించేది ( పోతరాజుగా రభిలషించేది జీవన్ముక్తి కాదు, చేరుటకు అనేపదం దానికి బాధకం ) కాదు కనక ఆలా టికోరిక అమంగళంగా సామాన్యకవులే కాదు మహా వేదాంతులైన శ్రీ శంరాచార్యాదులు కూడా భావించివున్నట్టు వారు వారు వారివారి గ్రంథాది ని చేసిన మంగళములవల్ల స్పష్ట మవుతుంది. అట్టిస్థితిలో మనపోతరాజు "మంగళాదీని మలగళ్ల మధ్యాని మంగళాంతాని " అనే శిష్ట సంప్రదాయాన్ని కూడా గణింపక " కైవల్యపదమే " తనకు ముఖ్యంగా కావలసి నట్టు త్రికరణశుద్ధిగా నిర్భయంగా గ్రంథాదిని వాడిపున్నాఁడు. దీన్నిబట్టి ప్రతిమనుష్యుఁడున్నూ మహాపండితుఁడు మొదలుకొని పరమ మూర్ఖుడు వఱకు ఆసించే ఐహికానందాన్ని మనపోత రాజుగారు యెంత వరకూ గౌర వించారో విస్పష్టమే కావున విస్తరించేది లేదు. ఐహికానందమందు బొత్తిగా గౌరవం లేని పోతన్నగారికి రాజులలో పని యేముంటుందో