పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క థ లు - గా థ లు – 3

విజ్ఞలు గుఱుతిస్తారు. యీ కృతులివ్వడంలో కొందఱు వక యుక్తి

చేస్తారు. యెవరో సంపన్నులవద్ద దువ్యాన్నైతే పరిగ్రహిస్తారు. దానికి ప్రతిఫలంగా బోలెఁడు పద్యాలతో గ్రంథాదిని వారి వంశాన్నిన్నీ వర్ణిసారు. యిఁక మూనేదల్లా ఆశ్వాసాదియందున్నూ ఆశ్వాసాంతమందున్నూ స్త్రవ్యపదాతలను మాని యే దేవుణ్ణో సంబోధిస్తారు. ఆ ద్రవ్యప్రదాత ఆలాగే చేయవలసిం దన్నట్లు పీఠికలో తేలుస్తారు. యివస్నే వట్టి యుకులు. యెవరివద్ద ద్రవ్య స్వికారం చేయడం జరిగిందో వారికి కృతి యిచ్చినట్టే లోకము భావిస్తుంది. యీ కుయుక్తులు యీ కాలంలోనే గాని పూర్వకాలం లో వున్నట్టు లేదు. నరకృతి దూష్యమనె మాటకూడా పోతరాజుగారి ప్రవృత్తి వల్లనే బయలుదేరింది.  కవికర్ణరసాయన గ్రంధకర్త సంకుసాల మహాకవిన్నీ కూచిమంచి తిమ్మకవిన్నీ పోతరాజుగారి ప్రవృత్తిని బలపఱుస్తూ కొంత్గ నిరసనభావాన్ని వారివారి గ్రంధాలలో కనపఱుస్తూ వచ్చారు.
    "ప్రభు దురాత్ముల నెవ్వాడు ప్రస్తుతించ్" లోనైన వాక్యాలు సుప్రసిద్ధాలే కనక స్పృశించి విడిచారు.  పోతరాజుగారు రపులలో అగ్రస్థానం వహించడమే కాకుండా భక్తులలోకూడా అగ్రస్థానాన్ని వహిస్తారు.  అయితే యీ మహాకవిని నన్నయాదులతో పాటు ప్రయోగ విషయంలో కవిలోకం అనాదిగా గౌరవించినట్టు కనబడడం లేదు.  ధారాశుద్ది, నిర్ధుష్టత, మాధుర్యము వగయిరా గుణాలనుబట్టి చూస్తే యీమహా కవి సర్వదా నన్నయ్యకు మించుతాడు గాని లొక్కడు.  ఆయన గురుశుశ్రూషా పూర్వకంగా శాస్త్రాభ్యాసం చేసి అష్టభాషావాగనశాసన" బిరుదాన్ని సంపాదించి తన కవిత్వంలో ఆ పాండిత్యాంభవాన్ని యధాయోగ్యంగా ప్రదర్శించాడు. మన పోతన్నగారో? "సహజపాండిత్య" బిరుదాంకితుడు. కేవల వరప్రసాది. అంటే యేకొంచెమో  కావ్య పరిచయం మాత్రం సంస్కృతాంధ్రలలో గ్రుముంఅతి, బాల్యంలో కలిగించుకోకుండా యింతటివాడు కాజాలదు.  గాని వ్యాకరణాది శాస్త్రాలు