పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూపాలుఁడుగారికి సంబంధించేదే అని తెల్పుతుం దని తెల్పడానికే. సర్వజ్ఞ సింగభూపాలుఁడు గీర్వాణ భాషలో పండితకవులు మెచ్చుకోఁ దగిన మహాకవి యని చాహాటంగా ఆయనగ9ంథం (సింగభూపాలీయం ) వల్లనే తెలుస్తుంది. అట్టివిద్వదాస్త్రజును పోతరాజుగా రెందుకు యింతగా యీసడించారో ? వాయవలసివస్తే తోువో ఆకాశసౌధాలు కట్టినట్టం టుందే కాని యథార్ధం వాసినట్టు పరిణమించదు. వారికీ వారికీ జరిగిన పసంగాలు సరిగా మనకు తెలియవుగదా : పోతరాజుగారికి రాజులను స్తుతించి తద్ద్వారా కుటుంబపోషణ చేసుకోవడమందు బొత్తిగా రాయిష్టం లేదన్నది సర్వజనులున్నూ విశ్వసించే అంశం. ఆయీ సందర్భం వామన చరిత్రలో వున్న

క. “వ్యాప్తిం జైందక వగవక,
ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచున్
దృప్తిం జెందని మనుజుఁడు
సప్తద్వీపములనైనఁ జక్కంబడునే ? "

అనేపద్యం మొదలైన కొన్ని పద్యాలవల్ల స్పష్టంగా గోచరిస్తుంది. సంస్కృతానికి అనువాదం గదా ! భాగవతం. ఆందులో పోతరాజుగారి స్వంతాభిపాయాన్ని అన్యాపదేశంగా మనం గహించడము యేలాగ ? స్థూలదృష్ట లనుకు cటూరు గొని సంస్కృతాంధ్రాలు రెండూ దగ్గిఱ పెట్టుకుని పరిశీల్చిస్తే యీ సంశయం క్షణంలో తేలుతుంది. చాలాచోట్ల పోతరాజుగారు స్వతంత్రించి పెంచి మూలానికి వన్నె తెస్తూ వచ్చారు. విన తేదూ ? " నేనే రామాయణాన్ని ఆంద్రీకరిస్తే గ్రంథం బళ్ళని බ්‍රි’ෆ వలసివస్తుంది " అనేవార (ట ! పోతరాజు గారు; యీ మాట జగత్ర్పసిద్దమే. ధాగవతం మూలం కంటే కొంత పెరింగిందని అందఱూ యొఱిఁగిందే. అందులో వామనచరిత9లో యెన్నో పద్యాలు పోతన్నగారి స్వకపోల కల్పన లని పరిశీలిస్తే స్పష్టపడుతుంది. మొ_త్తం యూమధ్య పతికలలో బయలుదేణిన సిద్ధాంతాలు అపసిద్ధాంతాలనిస్నీ " బాలరసాలసాల " అనే