పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క థ లు - గా థ లు - 8 పోత్రరాజు గారిదే అని సిద్ధాంతీకరిస్తూ కూడా, అది యీయన రచించిన "భోగినీదండకానికి " సంబంధించిం దనిన్నీ, యీ సందర్భానికి ఆపద్యం లోనే వున్న "అప్పడుపుఁ గూడు" అనే మాట సాధక మవుతుందనిన్నీ కొంత వ్రాసివున్నారు, ఆ వ్రాతలు నాకు బొత్తిగా రుచించలేదు. పద్యం ముమ్మాటికీ పోతరాజుగారిదే అనిన్నీ పద్యంలో వున్న తాత్పర్యం జనరల్ గా రాజుల కందఱికీ సంబంధించేదే అనిన్నీ సహృదయులు విశ్వసిస్తారని నావూహ. అందుకు--

ఉ. “ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురమ్ములు వాహనమ్ములున్
సొమ్ములు గొన్నిపుచ్చికొని సౌక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతనా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్."

అనే భాగవత పీఠికలో వున్నపద్యం పూర్తిగా తోడ్పడుతూ వుందని మనవి చేస్తున్నాను. యీ మధ్య పత్రికలలో వ్రాసిన వ్యతిరేకవాదులు యీ పద్యం వుందని లేశమున్నూ గుర్తించి నట్లే నాకుతోచ లేదు. ఆకాలంలో చాలామంది రాజులు వున్నా పోతన్నగారి హృదయంలో వున్నవారు వేంకటగిరివారే. ఆ సంస్థానంవారికి "కర్ణాటక దేశాధీశ్వరులు" అనే బిరుదనామం పున్నట్టు వారివంశచరిత్ర వల్ల తేలుతుంది. బహుశ గోపీనాథ వేంకటకవి తన రామాయణపీఠికలో యీ బిరుదాన్ని వాడి వున్నాఁ డనిన్నీ దాన్ని బట్టి మేము ఆసంస్థానానికి పెళ్ళినప్పడు చెప్పిన పద్యాలలో "కర్ణాటధారుణీంద్ర ! శ్రీరాజగోపాలకృష్ణయాచభూప బహదర్ మహారాజ ! " అని వాడివుంటామనిన్నీ జ్ఞాపకం. యిక్కడ దీన్నెందుకు వ్రాశానంటే? శ్రీపోతరాజుగారు “ కాటుక గ్రంటినీరు చనుగట్టు పయిం బడ నేల యేడ్చెదో హాటక గర్బురాణి! విను " అని సరస్వతిని వోదార్చే పద్యంలో వాడిన " ఆఁకటికోసము తాళలేక కర్ణాటకిరాటకీచకుల కమ్మ నిజమ్ముగ నమ్ము భారతీ ! "అని కర్ణాట రాజు లనే అర్ధమిచ్చే "కర్ణాటకిరాటకీచరుల కమ్మ నిజంబుగ నమ్మి భారతీ!" అని కర్ణాట రాజు లనే అర్ధమిచ్చే "కర్ణాట కిరాటకీచకులు"అనే " అనేపదం “ బాలరసాలసాల ” అనేపద్యం సర్వజ్ఞ సింగ