పుట:Kasiyatracharitr020670mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనుష్యులు కాపురమున్నారు. ఆ షహరులో పెద్దమనుష్యులు ఆనందము కొరకు చేసుకోవడ మేమంటే ఒకబగీచా అనే చిన్నతోటవేసి, అందులో జలధారలు పయికిలేచే కారంజీలు, కట్టి యుంచుకొనుచున్నారు. ఆజల సూత్రాలు అలమారముగానే యుంచున్నవి.

అక్కడి రాజ్యూతంత్రము జరిపే క్రమమంటే పూర్వకాలమందు డిల్లీ పాదుషాను, శిఫాయి ధర్మముచేత సంతోషపెట్టి, ఆరాజ్యమును జాగీరుగా పుచ్చుకొన్న ఆనవాబు వంశస్థులు ఇప్పుడు రాజ్యము చేయుచున్నారు. యింతకు మునుపు షౌలరుజంగు అనే అతడు దొర తనముచేసి, సంవత్సరము కిందట చనిపోయునాడు. అతిని కొడుకులలో నొకడయిన నానద్దౌలా అనే అతడు ఇప్పుడు కుంఫిణీవారి సహాయము చేతకట్టుకొని ప్రభుత్వమును వహించి యున్నాడు. ఈ నవాబు కింద ఒక దివాన్ జాగీరు అనుభవింపు చున్నాడు. అతని కింద ఒక పేష్కారు సకల రాజ్య తంత్రము విచారింపు చున్నాడు. ఉండే రాజ్యమంతయు నవుకరులయిన అమీరు ఉమరాలనె పెద్దమనుష్యులకు జాగీరులుగానున్ను, పారంపర్యముగా ప్రభుత్వము చేసేవారికి జమీనులు గానున్న, భాగించి జమీనుదార్లవద్ద మాత్రము సాలుకు ఇంత మాత్రమని రూకలు వసూలుచేసుకొను చున్నారు. అమానిగా తాలూకాల నుంచుకొని మామిలియ్యతు వ్యహారమును జరుపు కోవడము నిండా లేదు. వారి వారి అధీనముగా నుండే భూమికి వారు వారు పూర్ణమయిన స్రాతంత్ర్యము గలిగి ఆయా భూములలోని కాపురస్థులను భర్త భార్య మీద చెల్లింఛే అధికారము కంటే ఎక్కువయిన అధికారముతో నేలుచున్నారు. ఆనావాబు పెద్దల వద్ద 40 సంవత్సరముల కిందట కుంఫిణీ వారు స్నేహమూలకుగా ప్రవేశించి 6 పటాలాలను, వారి తయినాతిగా శికందరాబాదు అనేస్థలములో ప్రవేశపెట్టి, వకీలు భావనగా నొక రెసైడెంటును అక్కడ నిలిపినారు. ఆ పటాలాలవద్ద జాగీరుగా కుంపిణీవారు పుచ్చుకొని యిప్పటికిన్ని అనుభవింపు చున్నారు. క్రమక్రమముగా రాజ్యతంత్రములో ఏ పని జరిగించ