పుట:Kasiyatracharitr020670mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలసి వచ్చినా రెసైడెంటు అనుమతిలేక జరిపింఛె వాడికెలేని ఘట్టము ఇప్పట్లో పొసగి యున్నది. తమకు రూకలు కట్టని బలవంతులయిన జమీనుదారులవద్ద సాలేనా పయికము వసూలు చేసుకొనేటట్టు కందనూరు నవాబు రాజ్యము కుంఫిణీవారి యధీనము చేసినట్టే, కొద్ది కొద్దిగా చేయుచు వచ్చుచున్నారు. అటువంటి జమీందారులవద్ద కుంఫిణీ వారు రూకలు వసూలుచేసి నిజాముకు ముజరా యిప్పించుచున్నారు. సదరహి 6 పటాలాలు గాక నింకా 12 పటాలాల పర్యంతము రిసైడెంటు మూలకముగా ఆ నవాబు దివాన్ ఫేష్కారు యిచ్చుచు, రూకలు కట్టని జమీదారుని మీదికి కావలసినప్పుడు కావలసిన మట్టుకు ఆ ఫౌజును పంపించుచు వచ్చుచున్నారు. ఇప్పుడు దివాన్ ఫెష్కారు చేసే చందులాలా సదరహీజాస్తి పటాలాల జీతానికి గాను నెల 1 కి సుమారు 3 లక్షల రూపాయలు యిచ్చుచున్నాడు.

యిదిగాక నవాబు మనోవర్తి ఖర్చులకు గాను నెల 1 కె 3 లక్షల రూపాయలు ఇవ్వవలసి యుంచున్నది. ఇంతేకాక నజురుయినా యతులుగా కొంత సెలవు చందులాలుకు తగులుచు వచ్చుచున్నది. ఇది పోగా మిగిలిన వస్తువులు ఆ దివాన్ పేష్కారు చేసేవాడు సమ్మతమైన వ్రయము చేసుకొనుచు వచ్చుచున్నాడు. ఆ వ్రయములు చెయ్యడమునకు రాజ్యములో అయ్యే వసూలు చాలక దివాన్ పేష్కారు అప్పులతో తహతహ పడుచున్నాడు. ఆ నవాబు రాజ్యమంతా కుంఫిణీ వారివల్ల చాలా భయమును పొంది యున్నది.

యిటువంటి షహరు 20 తేదీ ఉదయాన 4 ఘంటలకు వదిలి 3 కోసుల దూరములో నుండే మేడిచెర్ల అనేయూరు 5 1/2 ఘంటలకు చేరినాను. దోవ బహు సరాళము; గులక యిసకపొర; గుర్రపుబండ్లు నడవడానికి యోగ్యముగా నున్నది. బాటకు నిరుపక్కల సీతాఫలపు చెట్లయడవి, మనోహరముగా నున్నది. మేడిచెర్ల యూరి ముందర