పుట:Kasiyatracharitr020670mbp.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యింగిలీషు దండులో నేను దిగిన స్థలము వాసయోగ్యము. ఆ షహరుకు చుట్టునుండే భూమి బహు సారవత్త మయినది. ఏవృక్షము వేసినా అరి వీర్యముతొ పయిరయి వచ్చుచున్నది. అయితే పయిరుపెట్టే శ్రద్ధ యెవరికిన్ని 2 కారణములచేత లేదు. మొదటి కారణమేమంటే బీదలయినవారు ఏచెట్టువేసినా వాటిఫలమును క్షేమముగా, ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమేయశస్సుగా భావించుకొని యుండే లోకులు అనుభవించ నియ్యరు. రెండో దేమంటే ఉపపన్నులు తోటలు వనాలు వేసుకొనవలె నంటే రాజకీల్యము లయిన విత్పరంపరలు అప్పుడప్పుడు వారికి కలుగుటచేత ఆ సుఖము ననుభవించ డానికి ప్రాప్తిలేక నున్నది. ఇంతకున్ను ఓర్పుచేసిన చెట్లు బహుబాగా అయియున్నవి. చోటా అరంజీపండ్లు విస్తరించి కలవు. సకల విధములయిన పండ్లున్ను, అరటిపండ్లు దప్ప మంచివిగానే దొరుకును. అయితే అతిప్రియము. చెన్నపట్టణము కంటే మూడింతలవెల యివ్వవలసినది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియములయినా మహా రుచికరములుగా నున్నవి. వస్త్రాలు, ఆభరణాలు, శిఫాయిలకు లాయఖు అయినవి, ఆ షహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటి యుత్సాహధైర్యము లెవరికిన్ని లెనందున వర్తకులు తేవడములేదు. ఆభరణాలు వగయిరాలు ఉంచుకొని విక్రయించేవారు తమ పాపు నిమిత్తమై కొంత శిబ్బందిని వుంచుకొన వలసి యున్నది. తద్ద్వారా ఒక గొప్పగౌరవము వారికి గలుగుచున్నది. అందువలన రత్నాలు, నగలు, కావలసిన గొప్పవారు వారియింటికి పెళ్ళి, వారిని పిలిపించుకొని కావలసినది వారు చెప్పిన ధరకు పుచ్చుకొని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదు నిచ్చుచున్నారు. వర్తక సరణిగా అట్టి గొప్ప వస్తువులు కొని అమ్మడము లేదు. సాత్విక ప్రభుత్వముకల రాజ్యములో మెదిగినవారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆరాజ్య సంచారమున్ను, భయప్రదములుగా నుంచున్నవి.

ఆ షహరు 3 కోసుల దూరములో గోలకొండ అనే ప్రదేశ మొకటి యున్నది. అక్కడ బలమైన కోటయున్నది. అందులో నిజాముయొక్క, అంత:పుర స్త్రీలు సంస్థానము యొక్క మూలధనముతో కూడా ఉన్నారు, అందులో విస్తరించి గృహములు కట్టుకొని