పుట:Kasiyatracharitr020670mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనాయాసముగా నెక్కిపోదురు. అంతదూరము ఎక్కుడు దిగుళ్ళలో తిరుపతి గాలిగోపుర పర్యంతము అక్కవలసినంత ప్రయాస యెక్కడనున్నులేదు. నాతోడవచ్చిన వుప్పాడా బోయీలు 8 మందిన్ని నాడోలీని అనాయసముగానే మోసినారు. అయితే నాగులోటి దాటగానే కొండ యెక్కవలసిన దాని కంటే రఫంత ప్రయాస యెక్కువ గనుక, అక్కడ ప్రధమ మందే యీలాగున నున్నదే, యిక నేలాగున నుండునో యని అధైర్యము తోచుచున్నది. అవతల సాగిపోగా సుళువనిపించుచున్నది గాని వేరుగాదు. ఆ కోండ ఉయెక్కుడు, దిగుడులలో ఆత్మకూరి బోయీలకు వుప్పాడ బోయీలు తీసిపోలేదు. ఆ యాత్మకూరి బోయీలకు సంవత్సరమునకు నొకసారి పనిపడు చున్నది గాని నిండా పనిలేదు గనుక నెక్కడము, దిగడములలో తిరుపతి బోయీల వలెనే ఆబోయీలు వాడికే పడిన వారుకారు. నేను చేయించిన డోలీకి బంగాళా పాలకీ వలెనే రెండుం ముక్కాలడుగు వెడల్పు పెట్టించినాను. అది శ్రీశైలమునకు సాధారనముగా సాగిపోయినది. కందనూరు నవాబు వగయిరాలు పల్లకీల మీదనే శ్రీశైలమునకు వెళ్ళియున్నారు. సంపన్నులయి నందున దోవలోని చెట్ల కొమ్మలు కొట్టడమునకు ముందుగా మనుష్యులను జాగ్రత్త పెట్టి యుండవచ్చును.

17 తేది పగలు 3 ఘంటలకు శ్రీశైలముమీది గుడి కల్యాణ మంటపములో నుంటిని. అక్కడ ముందు గుడికి చుట్టున్ను గొప్ప పట్టణ ముండను. వేశ్యా స్త్రీల యిండ్లు మట్టుకు 370 ఉండినవి. ఆపట్టణ మంతయు ఇప్పుడు పాడుబడి పోయెను. ఇంటింటనున్న బావులు శిధిలములయినవి. గోడలుగూడా ఇప్పుడు తెలియుచునున్నవి. 500? ఏండ్లనాడు అనవేమారెడ్డికి భగవంరుని కటాక్షము చేత బంగారనుములు పండినవని వాడుక కలిగియున్నది. అతడు స్వామి గర్బగృహమునకున్ను, ధ్వజస్తంభములకున్ను బంగారు మొలాము చేసిన రాగి తగుళ్ళు కొట్టించినాడు. అని యుప్పుడు నిండా శిధిలములుగా నున్నవి.