పుట:Kasiyatracharitr020670mbp.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గోడలకంటె ద్విగుణ మయిన బలము కలవి గనుకనున్ను బహు బల మయిన కొయ్యసామాను అతినయముగా దొరుకుచున్నది. గనుకనున్ను వారు చెప్పిన ప్రకార మొక చావిడి కట్టదానకు రూ 20 చాలు నని తోచినది. ఆరాత్రి చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని ఉదయమయిన 4 ఘంటకు బయలుదేరినాను. ఆరాత్రి మిక్కిలి చల్లగాలితో కూడామబ్బు తుంపర పడుచుండెను గనుక నొక బోయిగుడిశె ఖాళీ చేయించి అందులో పండుకొన్నాను.


రెండవ ప్రకరణము

16 రతేదీ అక్కడికి 4 కోసుల దూరములో నుండే శ్రీశైలము 12 గంటలకు చేరడ మయినది. పెద్దచెరువు విడిచి వెంబడిగానే కొండయెక్కను ఆరంభించవలసినది. ఒక్ కోసెడు యెక్కుడు, దిగుడుగా నుంచున్నది. అయితే మెట్లువైపు (వీలు)గా కట్టియున్నవి. నిండా ప్రయాస కాదు, ఇరుప్రక్కలా అడివి. అటుపిమ్మట కోసెడు దూరము సమభూమి. అందులో పొయ్యేదారి రాతిగొట్టుగా నుంచున్నది. అటుపిమ్మట భీముని కొల్ల మనే$ అగాధాఇన కొండ్ పల్లమువరకు కొండ యెక్కుడు దిగుడుగా నుంచున్నది. అక్కడ మెట్లు ఏర్పరచి కట్టియున్నవి. ఆయాగాధ మైన కొండదొవలో నొక వాగు పారుచున్నది. అక్కడ ఆసోదా చేసుకొని కొండయేడుతిరుగుళ్ళు, రెండువేల మెట్ట్లు పర్యంతము, మిక్కిలి పొడుగుగా నెక్కవలసినది. ఆ ప్రదేశములో నెక్కేటప్పుడు, దిగేటప్పుడున్ను వాడికె లేనివారికి చుట్టూ చూస్తే కండ్లు తిరుగును. మెట్లు బాగుగా నెక్కవలసినంత దూరము కట్టి యున్నవి. చుట్టు ఏతట్టు చూచినా నవ్రతములున్నవి. యీప్రకారము రెండుకోసులు ఎక్కిన వెనుక సమభూమిలో రాతిగొట్టు గల మార్గము శ్రీశైల పర్యంతము పోవుచున్నది. ఆ కొండ యెక్కుటుకు, దిగుడుకు తిరుపతి బోయీలు డోలీకి 6 మంది అయినట్టయితే