పుట:Kasiyatracharitr020670mbp.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుడికి రెండు ప్రాకారములు కలిగియున్నవి. బయిటి ప్రాకారపు గొడలమీద నాలుగుపక్కల శివలీలలు సుందరములయిన ప్రతిమలుగా చెక్కియున్నవి. వాటిని శిల్పి బహు బాగాచేసినాడు. అయితే రాళ్ళను వయివుగా నంతన చేసినవాడుకాడు. ప్రాకారము మీద ప్రతి కోట కొమ్మకు నొక్కొక్క ప్రతిమ చెక్కియున్నది. గుడి లోపల గెండో ప్రాకారము బొత్తిగా శిధిల మయిన్నది. మంటపములు ఆ రీతిగానే యున్నవి. అర్చకులకు మనసు వచ్చినప్పుడు దీపారాధన, నైవేద్యములు స్వామికి చేయబడు చున్నవి. గాని నిత్య నియమము లేదు. బ్రాంహ్మణులు స్వేచ్చగా లింగమును తాకి అభిషెక నివేదనలు చేయవచ్చును. భ్రమరాంబా దేవికి మాత్రము మిరాశీ అర్చకులతరపున నొకడు నియమముగా గుడిలో కాపురముండి అర్చన చేయుచున్నాడు. అలాగు అర్చనచేసే గుమాస్తా సంవత్సరము ప్రాణము తోనుండుట దుస్తరము. అందుకు కారణము రోగప్రదేశమేనో, వానిభక్తి తక్కువేనో తెలిసినదికాదు. ఇప్పుడు 5 సంవత్సరములుగా రాజశ్రీభొట్లు అనే బ్రాహ్మణుడు 30 ఏండ్లవాడు ప్రాణముతో నక్కడ నిలచియున్నాడు. అది ఆశ్చర్యముగా నున్నది. అతడు ఏకాకి. ఆగుడి లింగము భూమికి జీనెడు పొడుగుగా నున్నది. విమానమునకు 4 శిఖరములు, అని నాలుగుపక్కల శిధిలము లయియున్నవి. నడమనున్న గొప్పశిఖరము దర్శనమునకు నుపయోగింపు చున్నది. ఆత్మకూరి దారిని వస్తే గుడిలో ప్రవేశించేవరకు శిఖరదర్శనము కానేరదు. నెల్లూరి కంభము మార్గములనస్తే గుడికి మూడుకోసుల దూరములోనున్న శిఖరేశ్వర మనేపేరు గలిగిన యున్నత ప్రదేశమునకు శిఖరము తెలియు చున్నది. ఆగుడివద్ద వశింపుచున్న చెంచువాండ్లు ఆత్మకూరి వారివలెనే మిక్కిలి కొవ్వినవారు. భ్రమరాంబ గుడికిన్ని, మల్లికార్జునస్వామి గుడికిన్ని సమీపమందే కొంచెపు మిట్టమీద శ్రీచక్రస్థాపన చేసియున్నది. గుడిలో 22 తీర్ధములున్నవి. ప్రతి తీర్ధమందున్నుకొండ