పుట:Kasiyatracharitr020670mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 తేది పగటిమీద నక్కడనుండి తర్లి రాత్రి తిరువళ్ళూరు చేరినాను. దోవ సరాళము. మళ్ళీ కొరతలేరు దాటవలెను. దోవలో వెంగలియనే గ్రామమువద్ద సత్రమున్నది. తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని యనే తీర్థమున్నది. అందులో ప్రాథః నెలవారు బెల్లము వేయుచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహా ప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది వేట స్థలము. అన్ని వస్తువులు దొరుకును. అదిపై పాళెమునకు 24 ఆమడ దూరము.

21 తేది పగటిమీద రామంజేరి మార్గముగా రాత్రి కనకమ్మ సత్రము జేరినాను. 2 ఆమడమూరము. దారిలో నొక నది దాట వలెను. రామంజేరి వద్ద దోవ రాతిగొట్టు; మిగత సరాళము. ఆ సత్రము బొమ్మకంటి శంకరయ్య కట్టించినది. వేట స్థలము. కోమట్లు సంపన్నులు. అగ్రహార మున్నది. అది మొదలుకొని కార్వేటినగరము వారిసీమ సత్రపు కోనేటినీళ్లు లెస్సయున్నవి.

22 తేది పగలు బుగ్గగుడి చేరినాను. బాట సరాళము. 1 ఆమడ. పుణ్యక్షేత్రము. శాశ్వతముగా మూడు జలధారలు - గంగా యమునా సరస్వతు లనిపించుకొని గుడికింద స్రవించి అరణ్యనదిలో బడుచున్నవి. కాశిగుడిరీతిగా మూర్తులకు పేర్లుగలిగియున్నవి. దగ్గిర గ్రామములు, యిండ్లు లేవు. పదార్థములు దూరమునుండి తెచ్చుకొని గుడివద్ద తోపులో వంట చేసుకొనవలెను. రమ్యప్రదేశము. అరణ్య నదీతీరము. ఆ రాత్రి నగిరె మీదుగా పుత్తూరు చేరినాను. 1 ఆమడ దురము. నగిరెవద్ద కనమ దాటవలెను. అది రాతిగొట్టు బాట. 4 గడియల దూరము ప్రయాస; అవతల సరాళము. నగిరె పేట స్థలము. ముసాఫర్లకు అన్ని వస్తువులు దొరుకును. అక్కడ వెంకటేశ నాయుడి కొడుకు గొప్ప సత్రము కట్టను యత్నము చేయుచున్నాడు. పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రమున్నది. బ్రాహ్మణులకు గోసాయిలకు బైరాగులకు ---- యిచ్చుచున్నారు. అక్కడ కుంఫిణీవారు దొరలకు ముసాఫరుఖానా కట్టియున్నారు. చిన్న పేట