పుట:Kasiyatracharitr020670mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

లెదనియున్ను యీ పురుషుడు యీ వుద్యోగమును వదలుట యీ కోరుటుకు బహు నష్ట మనిన్ని వ్యసనపూర్వకముగ సెలవిచ్చినారు. జడ్జీగారు యీలాగు చెప్పే పాటియోగ్యతతో అయ్యవారు తన వుద్యోగమును జరుపుకొన్నారు.

అయ్యవారు తాను జీవించియుండిన కాలమునకున్ను కీర్తి ప్రతిష్టా హేతువులయిన సత్కార్యములను అనేకముగా జరిగించి తుదను నిర్యాణకాలము సంభవించినపుడు తీర్దయాత్రా ఋగ్యజుస్సామ వేదత్రయ పారాయణాది సత్కర్మ ప్రభావ పరిశుద్దాంత: సరణలై పరమేశ్వర కరుణాకటాక్ష లబ్ధతత్వావబోధచేత మాతృ భ్రాతృ పుత్రికా భార్యానుహృన్మిత్ర బంధువులయెడల నుండిన స్నేహపాశములను మూషికా జాలచ్చేదన న్యాయముగా చేదించి యీషణత్రయ రహితులై దేహ లోక శాస్త్రవాసన లనే వాసనాత్రయమునున్ను అగిద్యాస్మితా రాగ ద్వేషాభినివేశంబు లనియెడు పంచ క్లేశములనున్ను జయించి నిస్స్ంగులై వానప్రస్తాశ్రమ ప్రతినిధిగా కొన్ని దినములు ఆరామవాసము చేసి మహావాక్యార్ధ విచారణవల్ల సచ్చిదానందఘన మయిన బ్రహ్మకున్ను తనకున్ను బేదము లేదని తెలిసి సోహంభావన జేయుచు నుండి యిష్టులుగా నుండిన వారిని తనకు ఆపత్సన్యాసము సిద్దింప చేయవలె నని బహుతరముగా ప్రాధించి తన స్నేహ సంహందెకులయిన వారికి అనేక విధవివేక హేతువులగు వాక్యములను బోధచేసి సమ్మతి పరచి నిర్యాణదినమందు బహిరంగమయిన ఆపత్సన్యాసమును స్వీకరించిన ముహూర్తములోనే యోగాసనాసీనులయి ప్రణవాను నంధానము చేయుచు ప్రాణోత్క్రమణ క్షణ పర్యంతమున్ను పూర్ణమయిన తెలివి కలిగియుండి, ఆత్మ నిత్యుడు దేహము అస్థిర మనియున్ను తెలిసిన వారు గనుక, దేహము వదలుటవల్ల వ్యసనమును చెందక సంతోషముతో అనాయసంగా శాలివాహన శకంబు 1760 అగు దుర్ముఖ భాద్రపద బహుళ పక్షాష్టమీ సోమ