పుట:Kasiyatracharitr020670mbp.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మరిన్ని తన కూతురి వివాహమందు "అన్నన్య క్షుధిత: పాత్రమనే వచనప్రకారము అన్నానకు ఆకలిగొన్నవారందరున్ను పాత్రులని యోచించి అందుకు ఆక్షేపైంచిన వారినిన్ని సమ్మతిపెట్టి సమస్త జాతులకున్ను అన్నప్రదానము చేసినారు". దీనివల్ల ఆయన సర్వ సమదృష్టి గల పురుషుడని స్పష్టముగా తెలియువచ్చు చున్నది. కొందరు యీవివాహ విషయమై ద్రవ్యమును వ్యయపరచుట కంటె చిన్నదానిపోషణకొరకు ద్రవ్యమును మదుష్యాధీనముగా నుంచుటకు ప్రతిగా యీశ్వరునిచేత నేను వుంచుచున్నానని చెప్పి అపారముగా అన్నదానము చేసినారు.

ఈచెన్నపట్టణమందు హిందు లిటరైరి సొసయిటి యనే విద్వత్సభను తాను కల్పనెచేసి దాన్ని వృద్ధిపొందించను యిచ్చటి గొప్ప మనుష్యులను స్వంతపనికి అనుసరించేలాగు అనుసరించి వారి వారికి ఇష్టములయిన విద్యావిషయము లన్నీ యీ సభవల్ల సిద్ధించునని అనేక మార్గములను కనుపరచుచు వారి కందరికిన్ని యీ సఃభమీద శ్రద్ధ వృద్ధిబోందేలాగు చేయుచు వచ్చిరి.*

అయ్యవారు తన వుద్యోగమును వదలుకొని విరామదశను బొందవలెనని తన్ను యేలుచునుండిన సుప్రీం కోరటు పెద్ద జడ్జీ యైన సర్ రాబర్టు కమిన్ దొరగారికి వ్రాసుకొన్నప్పుడు ఆ కోరటు అడ్వకేట్ జనరల్ జార్జి నార్టను దొరగారు అయ్యవారియొక్క అతి చాతుర్య విశిష్టమయిన ద్విభాషిత్వ క్రమములను విస్తరించి చెప్పినంతలో జడ్జిగారు తానున్ను అయ్యవారి సుగుణములను బహు తరముగ తెలియపరచునప్పుడు యీ వుద్యోగమును యీ పురుషుడు గడిపినట్టు గడిపే శక్తిమంతులను నేను యిదివరలో చూడ


  • దీనిని గూర్చిన తప్సీలుకు పీఠిక చూడండి.

సర్ రాబర్టు బక్లే కమిషన్ గారు మద్రాసు సుప్రీముకోర్టులో 31-12-1835 వ తేదీనుండి 17-1-1842 వ తేదీవరకు ప్రధాన న్యాయమూర్తిగా నుండేవారు.