పుట:Kasiyatracharitr020670mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిచ్చటా రివిన్యూబోర్డువారికి శ్రుతపరచి వానికి వెండిబిళ్ళయున్ను ఒక వరహాయెక్కువ జీతమున్ను కలిగేలాగు చెసినది సాక్షిభూతముగా నున్నది. ఆస్థలమునకు అష్టబంధనము చేయించి గజదానము చేసినారు. యిది వారి శక్తికి యెచ్చయిన కార్యముగా అందరికిన్ని తెలియవలశినది. అక్కడి కలకటరు ఆయననున్ను ఆయనతో కూడా వచ్చిన మరికొందరు ప్రభువులనున్ను చూచి మీరందరున్ను కూడి యిక్కడి దేవుల్నికి రధముకట్టిస్తే బాగా వుండునని చెప్పగా అప్పట్లో ఆ ప్రభువులందరుకున్ను అలాగే చేయచున్నామని ఆయనగుండా అనిపించి అక్కడినుంచి పట్టణమునకు వచ్చిన తర్వాత ఆ ప్రభువులు ఆ కార్యమును గూర్చి సదరహి అయ్యవారితో యెచ్చరించడమే కానుకొనిరి. అయ్యవారు తాను మంచిదని చెప్పినందున ఆకర్యము తన శక్తికి మించినదైనా అపరిమతమైన ధనవ్రయము చేసి రధము కట్టించి తన మాటను కాపాడు కొన్నారు. యిందువల్ల ఆడినమాట కాపాడుటకై శక్తికి మించిన కార్యములను సాధింపుచు వచ్చినారని స్పష్టముగా తెలియు చున్నది. వారి కాశీయాత్ర వెళ్ళినప్పుడు నేను ఆ రధానకు యినప గొలుసులు జాగ్రత్త పెట్టి గవర్నమెంటువారిగుండా వాటికి రంగుపూయించిన సంగతి స్వల్ప సహాయమైనా దాన్ని అనేక ప్రకరణములలో నుదాహరించి గొప్పగా కొనియాడిరి. యీలాగు స్వల్పోపకారములను గొప్పగా కొనియాడుతూ వచ్చినందున యితరులకు విశేష కార్యముల యెడల ప్రవృత్తికలుగుచూవచ్చెను.

ఒక్క సంవత్సరమునకు అధికముగానే వారు ప్రతి ద్వాదశిన్ని భక్ష్య భోజ్య ఫలాజ్య దధి ప్రాజ్యములయిన బ్రాంహ్మణారాధనలు చేసి తర్వాత తాను ద్వాదశి పారణ చేయుచు వచ్చినారు. ఆ సంతర్పణలు యీ పురమందు మహోత్సవములుగా నుండినవి. అన్న ప్రధానమందు వారి చాతుర్యమున్ను జాగ్రత్తయున్ను వర్ణింప శక్యము గావు. వొక్క స్థలమందు ఏకపాకములో ఏకాపోశనముగా వొక్క లోపమున్ను లేకుండా మూడు