పుట:Kasiyatracharitr020670mbp.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాలుగు వేల బ్రాహ్మణుల భుజించునప్పుడు తా నొక పరిచారకుని కంటే సులభుడుగా నటించెను. అందరికిన్ని అనేక విషయములలో కాలయాపన మౌచున్నది. ఆ పురుషుడు ఇట్టి సద్విషయమందు, శ్రమను యెంచక స్వల్పకాలమును వ్రయపరచినది పరలోకగతుడైనా వున్నట్టే కొనియాడబడేలాగు చేయుచున్నది. ఇట్టి సత్కార్యము చేసినవారికి అది కీర్తి హేతువు కావడము మత్రమేగాక యితరులకున్ను అలాటి కీర్తి యెడల సుబుద్ధి కలగుటకు కారణ మవుచున్నది.

యీ పురమందు క్షయమాస *విషయ మయి మహాసభ కూడినప్పుడు అయ్యవారు తన పక్షమును శ్రుతి స్మృతి ప్రమాణములతో స్థాపన చేయగా ఆ సభవారు మిక్కిలీ సంతోషపడి అందుకు చిహ్నముగా అయ్యవారికి రత్నహారమును బహుమతిచేసి వారి సద్గుణములను వొక పత్రికలో వ్రాసి ఆయనకు పంపిరి.


  • దక్షిణదేసములో చాంద్రమానము సౌరమానము కూడా వ్యవహారంలో వున్నాయి. ఉత్తరదేశంలో బార్హ స్పర్యేమానముమాత్రం వ్యవహారంలో వుంది. సౌరమాన సంవత్సరానికి 365 దినములు 15 గడియల 31 విగడియలు ఉంటాయి. చాంద్రమాన సంవత్సరములో 360 దినములున్ను, బార్హస్పత్యమాన సంవత్సరానికి 361 దినముల 11 గడియలున్నూ వుంటాయి. అందువల్ల ఈమూడు మానముల ప్రకారం గుణింపబడే పంచాంగాలకు తేడా ఉండితీరాలి. అయితే దక్షిణదేశంలోని దైవజ్ఞులు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడానికి మనపంచాంగాలలోని అధిక క్షయ తిధులలాగనే అధిక క్షయ మాసాలు కల్పించారు. ఒక్కొక్క సంవత్సరంలో అధికమాసం అని పేరుపెట్టి ఒకమాసాన్ని చేర్చి సంవత్సరానికి 13 నెలలు చేస్తారు. ఇలాగ సరిపుచ్చుకుంటూ వస్తూంటే కొన్ని సంవత్సరా లయ్యేటప్పటికి చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల తగ్గిస్తేగాని సౌరమాన సంవత్సరానికి సరిపోవని పరిస్థితి తటస్థింది. అంతట మన దైవజ్ఞులు, పండితులు, సభచేసి ఏ నెలను లెక్కలోనుంచి తీసివేయవలెనో నిర్ణయిస్తారు. అట్టిమాసానికే అనహస్పతి క్షయమాస మంటారు. అంతట ఆ క్షయమాసం లెక్కలోకిరాక తరువార వచ్చేమాసంలో కలసి పోగా ఆ సంవత్సరంలో 11 నెలలే వుంటాయి. శాలివాహనశక 1744 చిత్రభాను సం||లో పుష్యమాసము క్షయ మాసముగా నిర్ణయించబడింది. అది క్రీస్తు శకము 14-12-1822 కును

11-1-1823 కును మధ్య కాలమున వచ్చిన మార్గశీర్ష మాసమునకు సరిపోతున్నది. (స్వామి కణ్ను పిళ్ళగారి ఎపిమిరిస్ చూడండి.)