పుట:Kasiyatracharitr020670mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(సులు) *యేజన్సీలు గొప్ప జమీందారులు వీరితోవర్తకసరళిగా వ్యా(సంగము)*చేయిచువచ్చి !వొయర్ హవుసులొ బొక్కీపకీరుగావుండి హేడు కౌంటాంటు అయి తర్వాత సుప్రీంకోర్టు $యింటేరు ప్రీటరు, పనిలో ప్రవేశించినారు. అప్పుడు బోర్డు ఆవుత్రేడు ఆఫీసువారు ఆయన యెడల తమకు కలిగియుండే విశ్వాసమునకు గురుతుగా ముక్కుపొడి వేశే బంగారుడబ్బి యొకటి బోర్డు శక్రిటేరి మూలముగా సుప్రీంకోర్టు జడ్జీగారి శలవుమీద ఆయనకు యిప్పించినారు.

ఆయన తనకు పరులు స్వల్పోపకారము చేసినా వారియెడల జరిగించిన మేలు చెప్ప నలవిగాదనుటకు ఆయన తిరుణామలకు వెళ్ళినప్పుడు ఆ గుడిలో తనవలెనే స్వామి దర్శనమునకు వచ్చిన ప్రజలకు సహాయముగా నుండే యొక బంట్రౌతు తనకు జాగ్రత్తగా స్వామి దర్శనము చేయించినందుకు వాని మంచి నడతలను


  • నాకు దొరికిన ప్రతిలో బ్రాకెట్లలోని అక్షరాలు చిరిగివున్నాయి.

! మనదేశములో వర్తకం చేయడానికి వచ్చి ప్రభువులైన ఇంగ్లీషు వర్తక సంఘంవారు చాలా కాలం వరకూ దేశపరిపాలనతో పాటు తమ వ్యాపారం కూడా జరుపుతూనే వుండేవారు. అందువల్ల ప్రభుత్వం కచ్చేరీలతోపాటు వ్యాపార కార్యాలయాలుకూడా వుండేవి. బోర్డుఆఫ్ త్రేడు కుంఫినీవారి వర్తక శాఖకు సంబందించిన కార్యాలయము. వొయర్ హవుసు అనగా సరకులకొట్టు.

$ ప్రస్తుతం చెన్నపట్నంలో వున్న హైకోర్టు 1862 లో స్థాపింపబడినది. అంతకుపూర్వం దీని స్థానే రెండు ఉన్నతకోర్టు లుండేవి. ఒకటి ఇంగ్లీషురాజు అధికారంక్రింద స్థాపింపబడి ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం కేవలం విచారించే పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రెండవది ఇంగ్లీషుకంపెనీవారి అధికారంక్రింద స్థాపింపబడి మనదేశంలొ హిందూ మహమ్మదీయుల ధర్మశాస్త్రాల ప్రకారం కేసులు పరిష్కరించే జిల్లాకోర్టులపైన అధికారం గలిగిన సదరు అదాలతు కోర్టు. ఈ రెండు కోర్టులలోను ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తి ఇద్దరేసి సాధారణ న్యాయమూర్తులు వుండేవారు. రెండుకోర్టులలోను ఇంగ్లీషు అరవము తెనుగు మొదలైన భాషలలో తర్జుమా చేసే ఉద్యోగులుండేవారు. వారినే 'ఇంటర్ ప్రిటర్ ' అనేవారు. వీరాస్వామయ్యగారీ పనిలో 1819 లో ప్రవేశించారు.