పుట:Kasiyatracharitr020670mbp.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

ములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశచరిత్రను ప్రజల స్థితిగతులను గూర్చిన ప్రమాణగ్రంథంగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆగ్రంధాని కేవిధంగాను తీసికట్టుకాదు. సాందర్బానుసారంగా హెబరు గారి గ్రంధంలోనుండి కొన్ని సందతు లీగ్రంధంలో అక్కడక్కడ ఉదాహరించారు.

పూర్వముద్రణం అచ్చుప్రతులలో వదిలివేయబడి ప్రచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వున్న వ్రాతప్రతిలోని విశేషాంశాలను కొన్నింటిని సందర్భానుసారంగావుదాహరించాను.

వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటమును దీనిలో చేర్చారు. శ్రీ వీరాస్వామయ్యగారియెక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వారపురం శ్రీనివాసపిళ్ళేగారు, వెంబాకం రఘవాచర్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపటాన్ని కూడా దీనిలో చేర్చారు.

ఈగ్రేంధాన్ని మళ్ళీ ఉయిపుడు మిదించడంలో పూర్వ ముద్రణపు మూలగ్రంధంలో మార్పులు ఏమీ చేయక బధాతధంగానే అచ్చుమేయించాను. అయితే పాఠకుల సౌకత్యంకోసం గ్రంధాన్ని ప్రకరణాలుగా విభజించి, విషయం మారినప్పుడల్లా పేరాలుగావిడదీసి, వాక్యాలు సులభంగా అన్యయంకావడానికి మధ్య కామాలు, మొగలైన గురుతులున్నూ, వాక్యాలచివర ఫుల్ స్టాపు చుక్కలున్నూ వుంచినాను. అందువల్లను చరిత్రాంశాలు వివరణలుగల ఫుట్ నోట్సులను పూర్వ ముద్రణంలో 328 పుటలున్న గ్రంధం ఈముద్రణంలో 374 పుటలకు పెరింగిది.

కృతజ్ఞత.

కాశీయాత్ర చరిత్ర అచ్చు వేయించడానికి పూర్వముద్రణపు గ్రంధం కోసం చాలారోజులు ప్రయత్నించినా దొరకలేదు. పుస్తకం దగ్గరవున్న ఇద్దరు పెద్ద మనుష్యులు యిస్తామని ఇచ్చారుకారు. ఆఖరికి వేటపాలెం సరస్వతీ నికేతనం గ్రంధాలయంలో ఒక ప్రతి వుందని తెలియగా దాన్ని నా మిత్రులైన శ్రీ పీశపాటి సీతాకంతం గారు స్వయంగా వేళ్ళి తెచ్చిపెట్టారు. దానిలో కొన్నిచోట్ల అక్షారాలు చిరిగివున్నాయి. దాని కొక ప్రతి వ్రాసుకొని దానినిబట్టి ఈపుస్తకాన్ని అచ్చువేయిస్తుండగా రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి దగ్గర యింకొక ప్రతి వున్నట్లు తెలిసింది. దాన్ని నామిత్రులు శ్రీనిట్టల భవానిశంకత శాస్త్రిగారు తెచ్చిపెట్టారు. ఆప్రతినిబట్టి అచ్చుపడిన భాగాన్ని మిగతా గ్రంధాన్ని సవరణ చేశాను.

పాత ప్రతిలో వున్న వీరాస్వామయ్యగారి బొమ్మకు శ్రీ నారాయణసింగుచౌహణ్ గారు ఫోటోతీశారు. దానినిబట్టి ఆంధ్రపత్రికాధిపతులు శ్రీ శివలెంక శంభూప్రసాదు గారు బ్లాకు తయారుచేయించి యిచ్చారు. వీరాస్వామయ్యగారి యాత్రామార్గాన్ని తెలిపే దేశపటానికికూడా వారే బ్లాకు తయారు చేయించి యిచ్చారు