పుట:Kasiyatracharitr020670mbp.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాతప్రతి - మచ్చుపుటలు

జాతుల పుష్పాలు చూదవచ్చును యిక్కడివారు చాలా మూరవెడల్పుకల బట్టలు కడతారు. గనక యితర దేశాలవాడికె బట్టలు వీరికి పనికిరాక వుంటుంన్నది. యధోచితం యిక్కడివారు కర్మఫలంగానుంన్ను దేవబ్రాహ్మణ విశ్వాసం కలవారుగా వుంట్టారు. జగఢీశ్వర కటాక్షంచాత యిక్కడి హింద్దువులకు పూర్వ పురోవృద్ధిలేక పోయినప్పటికిన్ని ముంద్దర చెంద్దిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జారులవారి జనబాహుళ్యం విభవం తెంపు స్త్రీపురుష సల్లాపాలు చూడవలిస్తే ప్రతిదినం సాయంత్రకాలమంద్దు పరంగికొండ్డ శాలలోను సముద్రంవద్ద వాడరేవు శాలలోనున్ను నిలిస్తే వారు అందరు...వాహన విశేషాలు యెక్కివస్తారు గనక చూచి అనందించ వచ్చును యిటువంటి రాజధానిలో జగఢీశ్వరుడు తరాల వెంబడిగా జీవనం కలగజేసి నంన్ను నిలిపి వుంన్నాడు. జగద్గుగోసాహి జగద్గురోసాహి జగద్గుగోసాహి . కాశియాత్ర చరిత్ర వ్రాతప్రతి సంఫూర్ణ మైనది.

                              -----

సవరణ

"యిది ఏనుగుల వీరస్వామి అల్లించిన కాశియత్ర చరిత్ర" అనే శీర్షికతో అసలు గ్రంధం వ్రాత ప్రతి ప్రారంభమవుతుంది. ఈమచ్చుపుటలు శీర్షికను కూడా నేను అలాగే వ్రాసాను. అచ్చు చిత్తులు దిద్ధడంపూర్తిఅయి ఫారం కట్టేవరకూ కూడా అది సరిగ్గానేవున్నది గాని తీరా ఫారం మిషనుపై కెక్కిన తరువాత అచ్చువేయడానికి ఆజ్ఞయిచ్చేవారు అది పొరపాటనుకుని, వీరస్వామిని ఫీరాస్వామి అనిన్నీ, కాశియాత్రను కాశీయాత్ర అనిన్నీ దిద్దినారు!

అసలు గ్రంధానికి మళ్ళీ ఒక ప్రతి వ్రాయించి అచ్చు వేయవలసివచ్చి నందువల్ల ఇలాంటివి - లేఖరి పొరపాట్లు కొన్నీ, అచ్చు చిత్తులు దిద్దేవారి పొరపాట్లు కొన్ని, నా పొరభాట్లుకొన్నీ, దీనిలోకి దొర్లడం సంభవించింది. ఇందుకు క్షమాపణ వేడుకున్నాను.


సంపాదకుడు.