పుట:Kasiyatracharitr020670mbp.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్ని పదముల అర్థములు

పుట 1 సరాళము=సరళము; తిన్నని; సుళువైన; చిక్కులులేనిది; సరళము, సరాళము; బాట; భాట; అప్పటి వాడుకభాషలో రూపాంతరాలు - చూడు; బ్రౌణ్యనిఘంటువు. ఇది చాలసార్లు ప్రయోగింపబడినది. " పలపట్లల యిడ్లు = చిల్లరజనముయొక్క యిండ్లు, 'సకలపట్టాడ యిండ్లు 'అని వ్రాతప్రతిలో వున్నది. 'పలపట్టడ ' అనే అరవమాటలోనుండి పలపట్ర అనే తెలుగు రూపము వచ్చినది. పలపట్రజనము అనగా చిల్లరజనము, (rabble) అని బ్రౌణ్య - మిశ్రనిఘంటువు.

ఉత్తర పినాకిని దక్షిణ పినాకినికిని మధ్యనున్న దేశంలో అరవంలోనుండి, కన్నడంలోనుండీ,తురకంనుండీ, ఇంగ్లీషునుండీ కూడా చాలామాటలు తెలుగులోకి వచ్చికలిసి వాడుకలో నున్నవి. వీరాస్వామయ్యగారు కాశీయాత్ర చరిత్ర లోనే వ్రాశారు. ఈప్రయోగాలన్నీ బ్రౌణ్యనిఘంటువులో కనబడుతున్నవి.

2 పేటస్థలము=పేట, అనగా పట్టణసమీపమందుండి సంతసాగే యూరు; నగరము యొక్కశాఖ; బస్తీలోభాగము; లేక దానినంటిన ఉపగ్రామము. 'నాట్యస్థళము ' అని వ్రాతప్రతి లేఖరి వ్రాసియున్నాడు. వ్రాతప్రతికీ అచ్చుప్రతికీ వర్ణక్రమంలో ఇలాంటి తేడాలు చాలావున్నవి. అచ్చుప్రతిలో కూడా ఒకేపదము కొన్నిసార్లు ఒకలాగున మరికొన్నిసార్లు ఇంకొకలాగున వ్రాయబడినది. ఉదావరణానికి; బ్రాంహ్మణుడు, బ్రాఃహ్మణుడు; కర్మ, కమన్ మొదలైనవి.

3.(కనమ) రాతిగొట్టు; (దోవ) రాతిగొట్టు (6)- రాతిపారు, రాతిపాద, రాతిపర అని కూడా బహుళంగా ప్రయోగింపబడినది. (బ.ప్ర)*

ఇందులోని 'గొట్టు ' శబ్ధము భూమియొక్క స్వభావవమును సూచిస్తుంది. వస్తు స్వభావమువలెనే మనుష్య స్వభావమును సూచించే 'గొట్టు ' శబ్ద మున్నది. ఉదా:


  • ఈ పట్టికలోని కొన్నిపదములకు అర్థములను బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు వ్రాసియున్నారు. తక్కినవి బ్రౌణ్యనిఘంటువు మొదలైన గ్రంధములలోనివి.

^బ.=ప్ర=బహుళ ప్రయోగము; చాలాసార్లు ఉయోగింపబడిన పదము. బ్రౌణ్య= సి.పి. బ్రౌనుగారు రచించిన తెలుగు నిఘంటువు (1852) బ్రౌణ్య - మిశ్ర = బ్రౌణ్యనిఘంటువు చివర అనుబ్ంధముగా చేర్చబడిన మిశ్రపదముల నిఘంటువు(1854)

ఈపట్టికలో చేరని పదములు అర్ధములకు పై నిఘంటువులు చూడవలెను. హిందూస్థానీ పదములకు నేను కూర్చిన పారిభాషిక నిఘంటువు చూడవలెను.