పుట:Kasiyatracharitr020670mbp.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

దక్షిణం బస్తికి సమయమయిన తిరువళిక్కెణి మైలాపూరు తిరువటేశ్వరుడిపేట మొదలైన కొంన్ని వుపగ్రామాలు వుంన్నవి పడమట పక్క చూళా పొరశవాక కోమలేశ్వరుడిగుడి యివి మొదలైన కొన్ని గ్రామాదులు వుంన్నది. వుత్తరభాగమందు చాకలపేట రయపురం తండ్డయారువెడు మొదలయిన కొంన్ని గ్రామాదులు వుంన్నవి యీబస్తీలో వుండ్డే హిందువులు అందరు వుత్తరభాగమండ్డు తిరు (429)పట్టూరివరకు ఆరామక్షేత్రాలు భేటగా యేర్పరచుకొని విలాసకాలాల యందు అక్కడికి వెళ్ళీ విహరిస్తూ వుంట్టారు. కోమలేశ్వరుడిగుడివద్ద వక చింన్న యేరు ప్రవహిస్తూ వుంన్నది దక్షిణపక్క మైలాపూరి చెరువు వకటి వుంన్నది పడమటిపక్క నుంగ్గంబాక చెరువు వకటి వుంన్నది. వుత్తరపక్క ప్రతితోటలో తటాకాలు దొరువులు తొవ్వివుంన్నారు. అందులో జగఢీశ్వడి కటాక్షం చాల మంచి నీళ్ళూ కలిగివుంన్నది. సమస్త ద్వీపాంత్తర పదార్ధాలు పనివాండ్లసహా అమితంగా దొరుకుతూవుంన్నది. యిక్కడి వారి ప్రకృతులు వుపాయవేత్తలుగాని సాహసులు గారు. ద్రవిడ ఆంధ్ర కర్నాటక దేశాలకు మధ్యే యీప్రదేశం వుండ్డుట చాత బాల్యారభ్యం దెశియ్యమయిన యీమూడు భాషలున్నూ ముంద్దు ధొరతనం ఛేశినవారి తురకభాష యిప్పుడు ధొరతనం చేశేవారి యింగిలీసు భాష మాటలు నోట వానడంచాత నుంన్ను పదార్ధంగా కొంన్ని సంసృత వాక్యాలు అఃయశించ్చుట చాతనుంన్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటంగా వుంట్టూవస్తుంన్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్నూ పురుషులపట్ల నిండా చొరవ ఛేసుకోగలవారుగానున్ను అగుపడతారు. అయితే వస్త్రాభరణ కృషిప్రియులెగాని నైజగుణమయిన సాహసం నిండా కలవారుగా (420)తొచలేదు. యిక్కడి భూమి సారవంతం కాకపోయినా మోకులు చేశె కృషివల్ల ఫలకారిగావుంన్నది వృక్షాదులు పుష్టికారులు కాక పోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాలు సలవు సమస్త