పుట:Kasiyatracharitr020670mbp.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాతప్రతి - మచ్చుపుటలు

బాదువరకు పక్కీరులమయం గనుక సవారిమీద యవరువచ్చినా అడుగడుక్కూ పక్కీరులు పోగడి భిక్షం అడగకమానరు. వార్కి కొన్ని గవ్వలయినా యిస్తూరాకపోతే అవుమానం వంటిది పైసావారికి గొప్ప సంభావన చంన్నపట్టం ర్పూ 1 కి ఇక్కడి పైసాలు 50 పైసా 1 కి 20 పుంజీలు గవ్వలు వుంజీ 1 కి గవ్వలు 4 యీ హయిదరాబాదులో పిచ్చి రూపాయలని వకదినం గొవిందబకుషీలు అని ఒక దినుసు చలామణి అవుతుంది యీ రూపాయిలు ఒకచేతినుండి వకచేతికి వచ్చినట్టు అయితే ఒకటికి రెండుపైసాలు నట్టమియ్యకనే మారకం కానేరదు. యీ చలామణి రూపాయలకు యిక్కడవారుచేసే పరీక్ష అన్యాదృశ్య్హము. యటువంటి రూపాయికయినా ఒకదోషం పెట్టకమానరు. చన్నపట్టం కుంఫిణీరూపాయలకు ఆ తొందరలేదూ అయితే దొరకవు. యిక్కడి రూపాయిలకు ర్పూ. 1 కి. పైసాలు 40 పైసాలు 80 యీ షహరు గోడకు చేరినట్టుగా ముశీ అని యిక్కడివారు చెప్పి ముచుకుందనది పారుతూ వుంన్నది. యీనది వాడపల్లివద్ద క్రిష్ణలో కలుస్తున్నది గొప్పనది పోయిన సంవత్సరం (పుట. 42) నది ప్రవాహం యెక్కువగా వచ్చి ఢిల్లీ దర్వాజా వద్ద యింగిలీసువారుకట్టిన వారిధిని పగలగొట్టి యీ షహరులో కొన్ని వీధులు ముంచ్చివేశిపోయినది. బేగంబాజార్కు షహర్కు మధ్యే యీనది దాటడానికి పూర్వకాలమంద్దు తురకలు రాళ్ళతో అతిజలనతుగా వక వారధి యెనుగలు మొదలయినవి గుంపులుగా ఎక్కి పొవడానికి యోగ్యంగా కట్టినారు. షహరుచుట్టూ చింన్న తిప్పలు కొండలమయం అనేక తిప్పల అగ్రమంద్దు మశీదులు కట్టివుంన్నారు. హిందూ దేవాలయాలులేవు వుంన్నా వృద్ధికిరానివ్వరు షహరుకు యింగిలీసు దండ్డుకు 2 కోసులదూరం వుంన్నది మధ్య హుస్సెనుసాగరు అనే పేరుగల గొప్ప చెర్వు వుంన్నది ఆకట్టమీద యింగిలీసువారు గుర్రపుబండ్లు పొయ్యేటంద్దుకు యోగ్యంగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలు మనుష్యులు యెక్కి నడిచి చరచకుండా భాటకు యిరుపక్కలా తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను వినహాగా యితరులను ఆకట్టమీద హుకుంల్యాక యెక్కనివ్వరు. యీ జాతులవారిపేరు పరంగ్గీలని యాల అంట్టారంటే ఫిరంగ్గీలతో సహా