పుట:Kasiyatracharitr020670mbp.pdf/438

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

వాసయోగ్యం యిక్కడికి కోశడు దూరములో కారువాన అనే బస్తీ రత్నాలు వగైరా అంమ్మె వర్తకులు వుండె స్థళం వకటి వుంన్నది. ఆబేగంబాజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు నిజాంవారి ఖర్చుకింద విస్తారంగానున్ను అలంకారగానున్ను వక హవేలి కట్టించుకొని (పుట.43) బాడిగె నిజాంకు యిస్తూ కాపురంగావుంన్నాడు. యీహవేలిచుట్టు లోకులు వర్తకులు యిండ్లు కట్టుకుని వుండటచేత వకపెద్ద బస్తీ అయినది. యీస్థలం పేరు చంద్రఘాటు అంటున్నారు. షహరులోపల షాలీబండ అనేపేరుగల్గిన వక పేట వుంన్నది. యీస్థలమందు యిక్కడ కల బ్రాంహ్మమండలి యిండ్లు కట్టుకుని కాపురం వుంన్నారు. దివాను పెష్కారు చందులాలు యిక్కడ యిల్లు కట్టుకుని కాపురం వుంన్నారు. నిజాందేవడి యీ షహరు మధ్యే వుంన్నది. అనేక మయిన పెద్ద మనుష్యులు అమీర్లు వుమారాలు అనే పేరుగల వార్లు సాధారణపు వర్తకులు నిజాంవంశస్తులు షహరుమధ్య కాపురంవుంన్నారు. షహరుమధ్యే మక్కామశీదు అనే వక తురకల జపశాల వుంన్నది. వాటిస్తూపీలు రెండు మొలాం ఛేసినది బహుదూరాన్ని తెలుస్తుంది. మశీదుకు యదురుగా లోగడ దినాను మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతు కలది వుంన్నది. వాటికి సమీపముగా గుజలీ అంగడీచౌకు అనేపేరు గలది 1 బట్టల అంగళ్ళు పాత్రసామాను అంగళ్ళు నాలుగు దోవలు అనేపేరు చేరడానికిగాను కట్టిన ఒక గొప్పస్తూపెకలిగి నాల్గుద్వారాలుకలిగిన వక చావడి వుంన్నది. షహరులోపల రాజవీధులకంత్తా గుండురాళ్ళు పరిచినారు. అటువంటి వీధులలొవుండె కస్మలము అడుసు నడిచేవారికి పాదాలను పూడుస్తూ వుంటుంన్నది. యిండ్లాలంకారం సందుల కునంది యితర దక్షిణదేశం షహరులలో వాసంచేసేవారికి యిష్టతిగావుండదు. రాజ వీధులలో ఏనుకులు మొదలైన వాహనాలు సదా వస్తూపోతూ వుండుటచేతనున్ను ప్రతిమనిషి ఆయుధపాణులయి మెత్తని వారిని (పుట.43)నరకడం కొట్టడం శూరకృత్యంగా యిక్కడ యంఛేవాడికె అయి యుండడము చేత షహరులో యితరదేశస్తులు సవారి మీద పోయి రావలిస్తే కొందరు ఆయుధపాణులు వాక్పారుషం కలవారినిగా కూడా పిల్చుకొని పోవలశివుంన్నది. కృష్ణానది దాటినది మొదలు హయిదరా