పుట:Kasiyatracharitr020670mbp.pdf/440

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


26

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

వాసం చేసె వారుగనుక ఫిరంగ్గివారని యీ దేశస్తులనసాగినారు యితర దేశాలలో పరంగ్గీవారని అనబడ్డా(రు) కుంఫిణీలష్కరు వుండ్డె స్థళం హయిదరబాదుకన్నా దిన దినానికి యెక్కువగా (పుట.42) బస్తీ అవుతున్నది 20 సంవత్సరముల కింద్ద నేను చూచినప్పటికంన్నా యిప్పట్కి హాశ్చర్యకరమయిన బస్తీ అయినది షహరులో వస్తువుల్కు నిరుకులేదు యెవస్తువమీద సుంకాన్ని యవడు వూహించి దరఖాస్తుచేసినా దివాన్ జీసుంక్కం గుత్త యిస్తాడు కట్టెలబండ్లకు విస్తరాకుల్కు షహరులో రావడానికి నాల్గు అయిదు తీరువలు అడిగితీసేవాడికి జోరావరి గొద్ది యివ్వవలసివుంన్నది చంఫ్ఫినా అడిగే దిక్కులేదు యింగిలీసు దండ్డులో యీ తొందర ల్యాక న్యాయ విచారణకూడా కొత్తవాల్ చావడిలో కంమ్మిసరయాట్టు అసిస్టాంటుగుండా జరుగుతూంది గనుక లోకులు వర్తకులు యీదండ్డులో వశించడానికి దినదినానికీ యెక్కువగా యిచ్చయిస్తూవుంన్నారు యిక్కడి యిండ్లు అంత్తా యెన్నిమిద్దెలు అంతస్థులవారిగా కట్టినా స్తంభాలమీద పయివూరి లోభంచేసి మట్టి గోడలుపెట్టి ఆగోడలపైన నాజూకు అయిన సంన్నగార కావలశ్ని చిత్ర విచిత్రాలతో పూస్తూన్నారు యిక్కడ మట్టి గులక కలిస్ని యెర్రర్యేగడ మహాఘట్టిగా వుండతగ్గది ఇంగ్లీసు దండులో నేను దిగిన స్థళం వాసయోగ్యం యీ షహరుచుట్టూవుండే భూమి బహు సారవత్తూయినది యె వ్రిక్షం వేశినా అతివీర్యంగా పయిరు అయి వస్తుంన్నది అయితే పయిరు పెట్టె శ్రద్ద యెవరికి రెండ్డు కారణాలవల్ల లేవు మొదటికారణం బీదలయినవారు యెచెట్టు వేసినా (పుట.42) వాటి ఫలాన్ని క్షేమంగా ఆయుధాలే ఆభరణాలుగా వుంచుకొని దర్పణమె యశస్సుగా బీవించ్చుకొని వుండె లోకులు అనుభవించ్చనియ్యరు వుపసంపన్నులు తోటలు వనాలు వెతామంటే విపత్పరంపరలు రాజకియ్యంచాత అప్పటప్పటికి వారికి సకలుగుట చాత తాసుఖం అనుభవించడానికి ప్రాప్తం ల్యాకవుంన్నది యింతకు వోర్చివేశిన చెట్లు మహాభాగా అయివుంన్నది చోటాఆరంజిపండ్లు నిస్తారంకద్దు సకల విధములయిన పండ్లు అంటిపండ్లు వినహాగా మంఛ్ఛిది దొరుకును అయితే అతి ప్రియము చంన్నపట్ణానికన్నా మూడింతలు ధర యివ్వ