పుట:Kasiyatracharitr020670mbp.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19 వ్రాతప్రతి - మచ్చుపుటలు

21 ది రాత్రి రామంజేరి మార్గంగా కనకంమ్మ సత్రం చేరి నారు 2 ఆమడదూరం నది దాటవలశ్నిది రామంజేరివద్ద దారి రాతి గొట్టు మిగతాభాట సరాళం సత్రం బొంమాకంటి శంకరయ్య కట్టినాడు ప్యాటస్థళం కోమట్లు వుపపన్నులు అగ్రహారం వుంన్నది యిది మొదలుగా కావేటినగరంవారి శీమ గుంట్ట వుదకం బాగావుంన్నది.

22 ది బుగ్గగుడి భోజనానికి పగులు చేరినాను భాట సరాళం దూరం 14 ఆమడ పుణ్యప్రదేశం శాశ్వతంగా మూడుధారలు గంగ్గా యమునా సరస్వతీ అనిపించ్చుకుని గుడికింద్ద స్రవించ్చి నదిలోపడుతుంన్నది కాశీగుడి లాంచ్చనగా మూర్తులకు పేరు వుంచ్చివున్నారు సమీపాన వూరు యిండ్లు లేదు పదార్ధాలు దూరాన్నించి తెచ్చుకుని గుడికి సమీపముగా వుండ్డె తోపులో వంట్టచేసుకుని భోజనం చేసుకోవ్లశ్నిది. రమణియ్యం ప్రదేశం వుదకవసతి అరణ్యనదీతీరం యీరాత్రి నగిర మార్గంగా పుత్తూరు చేరినాను. 14 ఆమడదూరం నగిరివద్ద కనమ దాటవలశ్నిది కనం రాతిగోట్టు 4 ఘడియల దూరం భాట ప్రయాస అవతల సరాళమయిన భాట నగిరి ప్యాటస్థళం సకల వస్తువులు ముసాఫరులకు కవలశ్నిది దొరుకును యీ పగిరిలో వెంకటేశనాయ(పుట.8)డి కొమారుడు గొప్ప సత్రం కట్టను యత్నంచేస్తూ వుంన్నాడు. పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం వుంన్నది యిప్పుడువచ్చిన భ్రాంహ్మల్కు గోసాయీలకు బైరాగులకు సదావర్తి యిచ్చేటట్టు నిశ్చయమయి వుంన్నది కుంఫినీవారు దొరలకు ముసాఫరుఖానా కట్టివుంన్నారు చింన్న ప్యాటస్థళం కావలశిన సామానులు దొరుకును బ్ర్రాంహ్మల యిండ్లు వుంన్నవి మంచ్చినీళ్ళ గుంట వుంన్నది రమణియ్య ప్రదేశం చుట్టూ కొండలు.

23 అంజాలమ్మ కనమదాటి పడమాలపేటసత్రం ప్రవేశించినాను ఆమడదూరం కనమరాతిగొట్టు అయినా దాటడం నిండ్డా ప్రయాసకాదు ఆ కనమలో అంజాలమ్మ అనేశక్తి ప్రతిమెను వుంచ్చి వుంన్నది పందిలివేశి వుంన్నారు పరమాత్ముడి చైతన్యం ఆ ప్రతిమ యందు ప్రతిఫలించ్చి ప్రార్దించినవారి యిష్టశిద్దిని చేస్తూవుంన్నది భాట సరాళం. యీ సత్రం కొల్లా పెద్దసామి శెట్టి కట్టించినాడు సత్రం