పుట:Kasiyatracharitr020670mbp.pdf/434

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

విశాలంగావుంన్నది బ్ర్రాంహ్మల్కు మాత్రం సదావర్తి యిస్తూంన్నారు తద్వారా సత్రానికి యశస్సు కలిగివుంన్నది. కనకంమ్మసత్రం మొదలు యీవర్కు కావేటినగరంవారిరాజ్యం. యీ రాత్రి అలమేలుమంగాపురం మార్గంగా దిగువతిరుపతి చేరినాను ఆమడదూరం దొవలో సువర్నముఖి దాటవలశినది. చెరువుకట్టమీద కొంత్తదూరం భాట నడవలశ్నిది సరాళమైన భాటెను దోవలో కొంన్ని బస్తీఅయ్ని వూళ్ళువుంన్నవి 23 ఆదివారం 24 ది సోమవారం 25 ది మంగళ్వారం 26 ది 27 ది బుధవారం 28 ది గురువారం (పుట.4) 29 ది శుక్రవారం 30 ది శనివారం 31 ఆదివారం యీ తేదీ దినములు దిగువతిరుపతిలో వుంన్నాను.

23 ది భుధవారం కొండయెక్కి దిగినాను 27 ది గురువారం కపిలతీర్ధంలో సమారాధన చేసినాను 30 ది ఆదివారం పగులు 3 ఘంటల్కు తిరుపతివదిలి కరకరంబాడికి పోయినాను దిగువ తిరుపతిలో గొవిందరాజుల గుడి కోదండరామస్వామిగుడి వుంన్నది రామస్వామి గుడికి సర్కారు కుంమ్మక్కుఏమీలేదు గోవిందరాజుల గుడిఆచార్య పురుషుల స్వాధీనంలో వుంన్నది సర్కారువిచారణ కద్దు బ్రాంహ్మలు త్రిమస్తులగా 200 యిండ్లు కద్దు గురునాధ శెట్టి అన్నసత్రం స్మార్తులకు వుంచి వుంన్నాడు మునియప్పెళ్ళ 13 మందిచిన్నవాండ్లను పోషించ్చె పాటకశాల వుంచ్చి వేదాధ్యయనం చెప్పిస్తూ వుంన్నాడు చందూలాలా మొదలయిన ముగ్గురు పుణ్యాత్ములు గొసాయీల వగైరాలకు సదానత్రి యిప్పిస్తూవుంన్నాడు రెండ్డు మూడు రామానుజకూటాలని నామకరణంచేసి శ్రీవైష్ణవుల్కు ప్రసాదం దినం కలుగుతూ వుంన్నది. భారీవూరు సకల పదార్దాలు దొరుకును సకల విధములయిన పనివాండ్లు కలరు పంగ్గులూరు గురునాధ శెట్టి వగయిరా కొంద్దరు సాఃహుకార్లు వున్నారు. షహరుస్థళం అనిపించ్చు కుంట్టూ వుంన్నది కోతుల వుపద్రవం కలిగివుంన్నది పానానికి సరశింహ్మతీర్ధ వుదకం వుపయోగిస్తున్నది గాని వేరేలేదు రెండు ఘడియల దూరంలో కపిలతీర్ధం వుంన్నది యిది బహురమణియ్య ప్రదేశం గంగ్గదార సదాపడుతూ కింద తటాకవతుగా గంగ్ల నిలిచువుంన్నది (పుట.5)