పుట:Kasiyatracharitr020670mbp.pdf/432

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యిది ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్రచరిత్ర. 18th May 1830 1 page in the printed Edition. ప్రతి నెంబరు1

1830 సంవ్వత్సరం మే నెల 18ది కుజవారం రాత్రి9 ఘంటలకు చంన్నపట్నం వదిలి ప్రయాణమయి మాధవరం అనే గ్రామములో రాత్రి నిలిచినాను మాధవరం తండ్డయారువేడులోవుండె వాతోటకు మూడుఘడియల దూరం కీనీరుభూమి మాధుర్యమయిన వుదక సమృద్ధికలదు ద్ర్రావిడ వైష్ణవులు కసపురం క్రిషిమీద లక్ష్యం లేదు సమిధలు వగయిరా పట్నంలో అమ్ముకుని జీవనం చేసేవారు దోవలో వుప్పుకయ్య వుంన్నది ఆవుప్పుకాలువకు వారధికట్టి వుంన్నది దాటి రావలశ్నిది.

19 వుదయాన మాధవరం వదిలి పొల్లిపాలవాయ సత్రం మార్గంగ్గా వెంక్కటేశనాయుడి సత్రం చేరినాను అక్కడ తఋఆకము వుంన్న సత్రం ఖిలమయివుంన్నది అంగళ్ళుకద్దు మాధవరానికి 5 ఘడియలదూరం దొవ సరాళమయిన బుడ్డిభాట ఆ రాత్రి పెద్దపాళెం చేరి నాను దొవలో కొరతలేరు దాటవలశినది దగ్గర దగ్గర గ్రామాలు వుంన్నవి భాటసరాళం పెద్దపాళెంలో శక్తిరూపకంగ్గా పరమాత్ముడు తామస ఆరాధనను అంగీకరించ్చి లోకుల యిష్టసిద్ధి చేస్తూ వుంన్నాడు. అరణ్య నదీతీరం వాసయోగ్యం భ్రాంహ్మణ అగ్రహారం పలప ట్టాడ యిండ్లు శివాలయం వున్నది ఆ శక్తి చింన్న లింగ్గం జాడగా భూమిలో వుద్బవించ్చివుంన్నది. శక్తి ఆలయం బహు చింన్నది శూద్రపూజ యీస్థళం పై సత్రానికి రెండుఆమడ దూరం.

20 ది పగులు పెద్దపాళెంలోవుండి రాత్రి తిరువళ్ళూరు చేరి నాను దొవలో కొరతలేరు మళ్ళీ దాటవలశ్నది దోవ సరాళం మంచ్చిబండ్డిభాట నెంగలి అనే గ్రామంవద్ద దొవలో సత్రంవుంన్నది తిరువళ్ళూరు విష్ణుస్తళం తీర్ధప్రాబల్యం (పుట.2) తీర్ధంపేరు వృత్తాపనాశనీ తీర్ధంలో ప్ర్రార్ధనవాండ్లు బెల్లం వేయడం సాత్వికమూర్తి మహా ప్రాయశ్చత్తాలలో స్మృతిరీతిగా యీ తీర్ధం స్నానం యెత్తివుంన్నది ప్యాటస్థళం సమస్త వస్తువులు దొరుకును యీస్థళం పయిపాళ్యాని. రెండ్డుంన్నర ఆమడ యిక్కడ 21 ది మధ్యాంన్నంవర్కు వుంన్నాను.