పుట:Kasiyatracharitr020670mbp.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్సరిత్రపేరున మన కన్నులు గప్పుతూ బ్రిటిష్ ప్రభువుల యాధిక్యతను మన అల్పత్వమును ప్రకటించుటకు భారత దేశమున బ్రిటిష్ రాజ్యతంత్రమును సమర్థించుటకు ఏర్పడిన చరిత్ర వాజ్మయం లోని అసత్యపు వ్రాతల నన్నింటినీ పూర్వకాలంనాటి ఇంగ్లీషు గ్రంధకర్తల నోళ్ళద్వారానె ఖండించి రాజకీయార్థిక రహస్యాలను భేదించి యధార్ధ చరిత్రను బయల్పరచ గలిగాను. ఇంకా వివరాలు కావలసిన వారు చదువుకో గలందులకు అసలు గ్రంధాలపేర్లుకూడా అందులో వుదాహరించాను. ఇది నాలుగేళ్ళనుంచీ చేస్తూవున్న పరిశొధన యొక్క ఫలితము.

ఆంధ్ర వార పత్రికలోని వ్యాసాల శీర్షికలు చూడండి:

  • "విస్సన్న చెప్పింది వేదం-విన్ సెంటుస్మిత్తు వ్రాసింది చరిత్ర"

(ప్రచారంలో లేకుండా చేయబడిన పూర్వచరిత్రలు; చరిత్రలో కెక్కకుండా చేయబడిన, ఆంగ్లయుగంనాటి చరిత్రాంశాలు; నూతనంగా సృష్టిమబడిన పక్షపాతపు చరిత్రలు.)

  • భారతదేశ పారతంత్ర్యము - భారతీయుల దేశాభిమానము.

(భారతీయులు బ్రిటిష్ రాజ్యతంత్రానికి సులభంగా లొంగలేదు- దానికి ఇష్టపడి హర్షించలేరు - నూరేండ్లు పోరాడారు.)

  • ధరణాకూర్చొనుట - సాత్విక విరోధము.

(1678-82; 1865; 1813-15 సంవత్సతములలో కుంఫిణీ పరిపాలనలో జరిగిన సత్యాగ్రహముల చరిత్ర.)

  • ఇంగ్లీషు దొరతనముయొక్క ప్రత్యక్ష ఫలితాలు.

(భారత దేశ రాజకీయ ఆర్ధిక సాంఘిక పరిస్థితులలలో మార్పులు.)

  • బ్రిటిష్ హెబరుగారి భారదేశయాత్ర.

(1824-26 మధ్య ఆయన చూచిన భారతదేశ స్థితిగతులు.)

  • కృష్ణాపత్రికలో- "ఇంగ్లీషు చదువుల చరిత్ర."

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్రచరిత్రచరిత్రకాలం నాటి భారతదేశ రాజకీయ, ఆర్ధిక సాంఘిక పరిస్తితులను గూర్చిన వివరములను తెలిసికొన గోరువారు పైన నుదాహరించిన వ్యాసాలను, నేను రచించిన "భారత దేశమున బ్రిటిష్ రాజ్య తంత్రము" అను బ్రిటిష్ ఇండియా చరిత్రను తప్పకుండా చదవాలి.