పుట:Kasiyatracharitr020670mbp.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర - అనుబంధము

సౌరమాన చాంద్ర మాసములు - అధిక క్షయమాసాలు.

ప్రపంచములో మనుష్యులందరూ సూర్యచంద్రుల నడకలను బట్టి కాలం లెక్కించుకుంటారు. అమావాస్యనుండి అమావాస్యవరకు గాని పౌర్ణమినుండి పౌర్ణమివరకూ గాని చంద్రుని వృద్ధి క్షయాలు చూసి నెలలు లెక్కపెట్టుకుంటారు. ఇలాంటి నెలలో రమారమి 29 1/2 రోజులు వుంటాయి. అలాగే సూర్యుడి నడకవల్ల కలిగేఋతువుపోయి అది మళ్ళీ రాగానే ఒక సంవత్సరమైనదని వ్యవహరించు కుంటారు. సూర్యుడు ఆకాశ చక్రంలో మేషాది పండ్రెండు రాసులూ తిరిగి రవడానికి 365 రోజుల 6 గంటల 12 నిమిషాలు 30 సెమనులు పడుతుంది. 12 చాంద్రమాన మాసాలూ కలిసి 354 రోజుల 8 గంటల 48 నిమిషాల 34 సెకనులు మాత్రమే అవుతాయి. సూర్యుడొక రాసినుంచి ఇంకొక రాసిలో ప్రవేశించడానికి సంక్రాంతి అంటారు. దానికి పట్టే కాలాన్నే మాసంగా లెక్క పెట్టుకుంటే ఒకనెలలో 29 లేక 30 రోజులు ఇంకొక నెలలో 31 రోజులు వుంటూవుంటాయి. అలాంటి 12 నెలల సౌరసవత్సరానికి రోజులు 365 1/2 అవుతాయి. ఇలాంటి పండ్రెండు సంక్రాంతులను బట్టి ఏర్పడిన 12 మాసాలకూ మేషాది 12 రాసుల పేళ్ళు చైత్ర వైశఖాది 12 పేర్లుకూడా వ్యహారంలో వున్నాయి. ఈపద్ధతికే సౌరమాసం అని అంటారు. ఇది అరవదేశంలోను మళయాళదేశంలోనూ బంగాళాదేశంలోను వాడుకలోవుంది.

క్రీస్తుశకంలో ఇంగ్లీషువారు వాడేమాసాలుకూడా సౌరమానమాసాలే. తురకలు కేవలమూ నెలబాలుణ్ణీచూసి లెక్కపెట్టే చాంద్రమానమాసాలే వాడుకుంటారు. సౌరమాన సంవత్సరం కన్న చాంద్రమాన సంవత్సరం చిన్నది అవడంవల్ల వారి పండుగలు కొన్నాళ్ళవరకూ ఒక ఋతువులోను కొన్నాళ్ళతరువాత ఇంకొక ఋతువులోనూ వస్తూవుంటాయి.. పైన చెప్పినట్లు చంద్రసూర్యులు గమనాన్ని బట్టి గాక బృహస్పతి గమనాన్నిబట్టి కాలం లెక్కించుకొనే బార్హస్పత్యేమానం అనేది ఒకటి ఉత్తర హిందూస్థానంలోమగద దేశము మొదలైనచోట్లను ఓడ్రదేశంలోను వాడుకలో వున్నది. ఈ మాసంలో సంవత్సరానికి రమారమి 360 రోజులే వుంటాయి.

మన ఆంధ్రదేశంలోను మహారాష్ట్ర కర్ణాటక దేశాలలోను చాంద్రమానమే వాడుకలో వున్నది. చాంధ్రమానం శుద్ధపాడ్యమితోను సౌరమాన మాసం సంక్రాంతితోను ఆరంభం అవడం వల్లను ఒకే పెరుగల మేష లేక చైత్రమాసం యొక్కవ్యాప్తి సౌరచాంద్రమానాలనుబట్టి తేడా వున్నందువల్లను యీరెండు మాసాలని బట్టి ఏర్పరచిన పర్వదినాలకు, సంబంధం లేకుండాపోతుందని మన జ్యోతిష్కులు చాంద్రమానాన్ని సౌరమానానికి లంకేవేసి మన సంవత్సరాదిని సౌరమానం మేష మాసం మన చైత్రమున్నూ వృషభమాసం వైశాహమున్నూ అవుతాయి. పైవుద్దేశ్యంతో మన పంచాంగాలలో తిధి వార నక్షత్రాదులను కూడా ఇలాగే సరిపుచ్చారు. అమావాస్యనాడు సూర్యచంధ్రులు కలిసియుంటారు. చండ్రుడు రొజుకు రమారమి