పుట:Kasiyatracharitr020670mbp.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాయడుకట్టిన సత్రము 2 గంటలకు ప్రవేశించినాను. దారి బహుయిసక. రామయపట్నము వరకు కాలు పూడిబోతూ వచ్చినది. యివతల సత్రమునకు రెండు కోసుల అంత యిసకలేదు. సత్రము బహు వసతిగా వున్నది. వద్దవుండే అంగళ్ళల్లో భాటసారులకు కావలశిన పదార్ధాలు దొరుకును. యిక్కడ వంటభోజనము కాచేసుకుని యిక్కడికి 5 కోసుల దూరములోవుండే జువ్వులదిన్నె అనేవూరు 6 గంటలకు చేరినాను. దారి కొంతమేర యిసక, కొంత యిసక కలిసిన రేగడ. దారిలో మామిళ్ళదొరువు అనే మజిలీవూర ముసాఫరుఖానా దొరలు దిగే లాయఖుగా వొకటి వున్నది.

జువ్వలదిన్నె అనేవూరు గొప్పదయినా నీళ్ళు ఆసరా విస్తారములేదు గనుక పంటలుజబ్బు. పేటస్తలముగా శానాకోమటి యిండ్లువున్నందున సమస్తపదార్ధాలు దొరుకును. దేవాలయాల సహితముగా కొన్ని బ్రాహ్మణయిండ్లు వున్నవి. అందులో వొక యింట్లో రాత్రివశించినాను. కృష్ణకు యివతల పశువులు గొప్ప దేహాలు కలవిగా వుంటూ వచ్చినవి. అమ్మనబోలు మొదలుగా అటువంటి పశువులు పుష్టికలవిగా గాలిమందలుగా అనేకములు చూస్తూ వచ్చినాను.

నేను యీవరకు కన్యాకుమారిమొదలుగా సంచరించిన భూములలో యీపాటి వైలక్షిణ్యము, స్థూలము, వున్నతము కల పశువులను చూడలేదు. యీ పశువుల పోషణముందర వ్యవసాయము నున్ను యీ దేశపు కాపులు లక్ష్యపెట్టేవారు కారు. పొలము బీడువేసి వాటికి పుల్లరి అనే తీరువ యిచ్చి పశువులను మేపించి కాపాడుతారు. యీ నెట్టు వారికి పశుధనమే ప్రబలముగా కలిగి వున్నది.

25 తేది వుదయాత్పూర్వము 2 గంటలకు లేచి యిక్కదికి రెండామడ దూరములో వుండే కొడవలూరి సత్రము 8 గంటలకు చేరినాను. దారి పంటల్లూరివరకు యిసక కలిసిన రేగడ. పంటల్లూరు మొదలుగా సత్రమువరకు సడక్కువేశి శాలవేశి వున్నది. పంటల్లూరు భారీదస్తు అయ్యే గ్రామము. తహశీలుదారుడు వుండే కసుబా. నేను దిగిన సత్రము వసతిగా వున్నా జలసౌఖ్యము మట్టు. యిక్కడ