పుట:Kasiyatracharitr020670mbp.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరఫరాయి బంట్రౌతులను నాయక వాడీ లంటారు. వారు ముసాఫరులకు గొప్పవారయిన పక్షమందు సమస్త సరఫరాయి చేస్తూరావలసినది. నెల్లూరిజిల్లా మొదలుగా ఆదేతరహా నౌకరులను మహాతాదులంటారు. నెల్లూరిజిల్లాలో భూమికొలతను కుచ్చళ్ళు అంటారు. కుచ్చల 1 కి 2 గొర్రుల సంజ్ఞ యారాత్రి యిక్కడ వసించడమైనది.

26 తేదీ వుదయాత్పూర్వము నాలుగుగంటలకు లేచి యిక్కడికి 4 కోసులదూరములోనుండే వలగపూడిసత్రము 2 గంటలకు చేరినాను. దారి యిసకరేగడ కలిసియున్నది. యీసత్రము రాజాముద్ధుకృష్ణమనాయుడు వెలగపూడియనే గ్రామముందుగా యిక్కడి జమీందారులవద్ద యినాముగా సంపాదించి కట్టినాడు. గ్రామపు వసూలులో సదావృత్తి యిస్తూ వునారు. సత్రములక్షణముగా కట్టి యిప్పటికి బాగావున్నా కళాహీనమై వున్నది. నా అనుభవముచేత విచారించగా కళకలలాడుతూ వుండే భవంతుల కళావిలాసాలు వొకటే తీరున వున్నావాటి వ్యత్యాసకాలాలలొ కళాహీనమై పాడుకోరుతూ వుంటున్నది. గనుక యిటువంటి మానుష నిర్మాణములయందుకూడా పరమాత్ముని చైతన్యము యథోచితముగా ప్రతిఫలించెటట్టు తోచుచున్నది. యిక్కడ వంటభోజనాలు కాచేసుకుని 5 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసులదూరములోవుండే కరేడు అనేవూరు 2 గంటలకు చేరినాను.

దారిలో రెండు వుప్పుటేరులు దాటినాము. యిప్పుఛు కాలినడకగానే వున్నది. యీ రెండుయేరులలో సర్పాకారమయిన విషజంతువుల భయము కదాచిత్తుగా కలిగి వుంచున్నది. దారి యిసకకలిసిన రేగడ. అమ్మనబోలుకు ఆకులల్లూరి మధ్యే నాగర్తను కొత్తపట్టణము యీతముక్కల వగయిరా బస్తీలువున్నట్టు యీమధ్యే గొప్పవూళ్ళులేవు. కరేడు గొప్పవూరు. యాభై బ్రాంహ్మయిండ్లు, వొక సత్రము, రెండుగుళ్ళున్ను, కలిగిన పేటస్థలము. సమస్తపదార్ధాలు దొరుకును. యీ రాత్రి యీ వూరి కరణము కట్టించిన సత్రములో వసించినాను.

24 తేది వుదయాత్పూర్వము 2 గంటలకు లేచి యిక్కదికి 2 ఆమడ దూరములోవున్న కొత్తసత్రమనే పేరుతో రామానుజ