పుట:Kasiyatracharitr020670mbp.pdf/388

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నున్ను ప్రపంచ దృష్టిచేతనున్ను యిటువంటి వూహలు దేహదృష్టి విలయము పొందే కొరము చేయవలసి యున్నది.

కృష్ణాతీరమునందు 19 తేది మధ్యాహ్నమువరకు నిలిచి నాను. కృష్ణానదీ మహాత్మ్యము విచారించగా లోకులనుతరింపచేసే కొరకున్ను యీ కలిలో లోకుల పాపాలు యెంతబళువో అంత పాటి పుణ్యము వొక స్నానముచేతనే కలిగేకొరకున్ను శ్రీమహావిష్ణువు యీ నదీస్వరూపముగా అవతార మెత్తినట్టు తెలియవచ్చినరి. యీ కృష్ణామాహత్మ్యము స్కాందపురాణాంతర్భూతముగా వున్నది. యిక్కడికి 2 కోసుల దూరములో కళ్ళేపల్లి అనే మహాస్థలము వొకటి వున్నది. యీ నది సహ్యపర్వతములో వుత్పత్తి అయినది. ఆవుత్పత్తి స్థలసాగరసంగమాలకు 70 ఆమడ అని విన్నాను. యిక్కడ కృష్ణానది కోశెడు వడల్పు, అనేక గొప్పలంకలు కలవు. అందులో అనేక అడివి యావులు స్వేచ్చగా విహరింపుచున్నవి. యీ లంకలలో కాయకూరలు చాలాగా పైరై బందరు బస్తీలో వ్రయ మవుచున్నవి.

19 తేది మధ్యాహ్నము మీదట 1 గంటకు బయిలువెళ్ళి కృష్ణానది పడవలకుండా దాటి 5 కోసుల దూరములోవుండే కనగాల యనే వూరు సాయంకాలము 9 గంటలకు చెరినాను. యీ తీరమందు గ్రామస్థులు తమ ఖర్చుకింద పడవలు చేయించుకుని బీదలవద్ద డబ్బులు తరాతర ప్రకారము పుచ్చుకుని దాటిస్తారు. బలిష్ఠులకు అధికారస్థులకు అమిజీ (వెట్టి)కి దాటిస్తూ వుంటారు. యీతీరమందు నా స్నానకాల మందు చుట్టుపక్కల గ్రామాలలో వుండేవారుగా భూరి దక్షిణ నిమిత్తము 200 బ్రాహ్మణులు చేరినారు.

యిక్కడి బ్రాహ్మలలొ కొందరు దేశాంతరాలు వెళ్ళి ద్రవ్యము సంపాదించి స్వదేశము కుదురుగా చేరినందువల్ల నున్ను యీ తీరపు బ్రాహ్మలు పుత్రదారాదులయిన బాంధవులను వదిలి దక్షిణము కన్యాకుమారివరకున్ను, వుత్తరము కాశ్మీర పత్యంతమున్ను సంచారము చెసి లోకులు చేయతగిన బ్రాహ్మణపూజలు నిర్బంధపెట్టి చేయించుకుంటూ వుంటారు. యీరీతిని కొండవేడు మొదలయిన యీ స్థలజ్ఞులు విచ్చలవిడిగా వొకరినిచూచి వొకరు సంచరించ ప్రయత్నపడ్డవా