పుట:Kasiyatracharitr020670mbp.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆవరించేపాటి ముక్కరలు చాలా లావుగా చేసి ధరించుతారు. యీ లోపల భూమికొలతను కత్తెలు (కత్తులు) అంటారు. గంజాం మొదలుగా కృష్ణాతీరమువరకు పెద్దమనుష్యులు సమానుల సమాగమము అయినప్పుడు అత్తరుతాను వుంచి తాంబూలముతోకూడా అత్తరునున్ను అవశ్యము యిస్తూ వస్తారు. యీ కళింగదేశము మొదలుగా కోసులు సుళువుగా అగుపడుచున్నవి. యిక్కడి వొక కోసు దక్షిణదేశపు రెండుగడియల దూరానకు కాలు గడియ తక్కువ అని చెప్పవచ్చును. గ్రామలెక్కలు మొదలయిన వ్రాతలు రాజమహేంద్రవరానకు దక్షిణము తాటాకులలో వ్రాస్తారు.

గంజాం మొదలు విజయనగరము వరకు తామర సమస్త గుంటలలో, చెరువులలో వేశివున్నారు. వాటి తూంట్లను కూర మొదఒలయిన పక్వాన్నాలుగా చేసి భక్షిస్తూ వస్తారు. నీళ్ళు తూకడానకు బావుల వద్ద తాటాకులు దొన్నెలుగా కట్టివుంచుతారు. వాటికి తాడుకట్టి నీళ్ళు చేదినంతల్లో రెండుపళ్ళ నీళ్ళు వచ్చుచున్నవి. యీ కనగాల అనే వూరు గొప్పది. విశాలమయిన బ్రాహ్మణ యిండ్లున్ను వొక గొప్ప చావడిన్ని కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. యిక్కడ సమీపముగా కాటికెవా రని పౌరుష నామధెయముగల వొక నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్స చేయుచూ వుంటారు. యీ వూళ్ళో యీ రాత్రి నిలిచినాను. దారి నల్లచౌటిరేగడ. తుమ్మచెట్లు యిరుపక్కలా వుంటూ వచ్చినవి. దారిలొ భట్టుప్రోలు అనే వూరివద్ద లంజదిబ్బ అని వొక మిట్టవున్నది. అదిమొదలు చెట్లశాలను దారిలో వేసివున్నారు.

20 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే చందవోలు అనే గ్రామము 7 గంటలకు చేరినాను. దారి యిసకపర. యిరుపక్కలా చెట్లు పెట్టివున్నారుగాని నిండా లేతలు గనుక నీడ యివ్వనేరవు. యీ చందవోలు అనే వూళ్ళో వెచ్చా గొపాలకృష్ణమ్మ తమ్ముడు ధర్మపురి అనే అతను వొక సత్రము కట్టితివున్నాడు. యీవూరినుంచి కొండవీడుశీమకు దారి చీలిపొతూ వున్నది. యీవూరు తురక భూయిష్టమయినది. లోగడ అనేక శివా