పుట:Kasiyatracharitr020670mbp.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిద్దెను ఆ జమీందారుడు కట్టియున్నాడు. యీ కొత్తపాళెము చిన్నవూరు అయినప్పటికిన్ని వెచ్చా గోపాలకృష్ణమ్మయనే కోమటి యిప్పట్లో బందరు ప్రొవింషియల్ కోర్టులో ప్లీడరుగావుండి అతడు వొక సత్రము కట్టించినందున మార్గస్థులకు బహువుపకృతిగా వున్నది.

గంజాంలో బందం చలమయ్య అనే అతను, విశాఖ పట్టణములో చిన్నం చలమయ్య అనేఅతను, యానాంలో మన్నెం కనకయ్య, రాజమహేంద్రవరములో గుండు శోభనాద్రి వగైరాలు జమీందారులయి లక్షాంతరములు వ్యాపారముచేసి దొరతనపు డౌలు పాయాపరువున్ను కలిగివున్నా వీరిని దక్షిణ దేశములాగున శెట్టి అనడములేదు గాని గారు అనే ప్రతిష్టావాచక ప్రయోగమున్ను తాజీం అనే ప్రత్యుద్ధానమున్ను వీరికి చేయకూడ దని వొక నిష్కర్ష యితర జాతులందరు తాగాల్యతునుంచి చేసుకొని అటు యీ దేశములో జరిగింపుచున్నారు. కోమటి జాతిలో వెచ్చా వారి కుటుంబము లాగున గవర్నమెంటు వుద్యోగాలు చేసిన కుటుంబాన్ని ఎక్కడా చూడలేదు/ శూద్రజాతిలోనున్ను యెంతగొప్పవాడైనా నాయిడనే ప్రతిష్టా వాచకాన్ని ఆ పురుషుని పేరుతోకూడా సాధారణముగా వాడరు. గంజాం మొదలుగా భోగస్త్రీలు సభాస్థలములకు వస్తే తంబుర వీణల వుంచుకొని పాడేకాలము తప్ప తక్కిన వేళలలో కూర్చుండకూడరు. పశ్చాత్తాపములేక రెండు మూడు ఝాములు వారిని నిలల్వపెట్టుతారు.

బందరుజిల్లా ప్రవేశించినవెనక బందిపోట్లు, పితూరీలు అనే మాటలు వినడములేదు. ఆ విషయమై యీ దేశము సుభిక్షముగా వున్నది. యిటీవల గుంటూరుజిల్లాలో భేది, వాంతి వుపద్రవాలు చాలా కలిగియున్నట్టు తెలియడమయినది. ఆ వుపద్రవము తగిలినయింట్లో మళ్ళీమళ్ళీ తగులుతూవున్నట్టు తెలిసినది. గనుక అందుకు హేతువు నాకు తొచడము యేమంటే అవశాత్తుగా వొక పురుషునికి ఆ వుపద్రవము తగిలి విపత్తుకు హేతువు కాగానే సన్నిహితులు భీతినిచెంది భీతిద్వారా యీ వుపద్రవము పరంపరగా వారు తెచ్చుకొనేటట్టు తోచుచున్నది. భీతి మరణాన్ని యివ్వగల వుపద్రవమని అనుభవసిద్ధముగదా! "తేన వినా తృణాగ్రమపిన చలతి" అనే వాక్యము సత్యమయినా దేహదృష్టిచేత