పుట:Kasiyatracharitr020670mbp.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీ మధ్యాహ్నము 12 గంతలకు యిక్కడినుంచి భోజనము చేసుకొని బయిలి వెళ్ళి వుప్పకాలవ సంగళ్ళకుండా దాటి రాత్రి 7 గంతలకు యిక్కడికి 6 కోసులదూరములో వుండే తుమ్మడి యనే వూరు చేరినాను. యీ మధ్యాహ్నము మీద నడిచిన దారి యిసకపర, శుద్ధబయిలు. యేలూరిపాడు మొదలుగా వర్షాలు లేనందున యిక్కడ దారిలో మడువులు బొత్తిగా యెండివున్నవి. దారిలో కలిదండియనే ప్రసిద్ధి గ్రామము దాటి వచ్చినాను. తుమ్మడి అనే గ్రామములో బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరకనందున కలకత్తాలో విశ్రయించడానకు యిచ్చివచ్చిన రెండు డేరాలు, వెంకటరాయనింగారికి యిచ్చివచ్చిన వొక డేరాగాక మిగిలిన రెండు డేరాలు యిక ఫరవాలేదు ప్రతివూళ్ళో బ్రాహ్మణ యిండ్లలో స్థలము దొరకునని అందరు బోధించినా చెయికావలికి యెనిమిదిమంది బోయీలచేత తెచ్చినందున ఆ రెండు డేరాలు వొక బావివద్ద వేయించి యీరాత్రి గడపడమయినది. యీవూళ్ళో మంచినీళ్ళు బహుప్రయాస. నేను డేరాలు వేయించిన స్థలమున వుండే బావి యీ వూరికి మంచినీళ్ళు, ఆ నీళ్ళు మాకు తాగకూడనిదిగా వున్నది. అభ్యాసము అన్నిటినిన్ని అనుకూలపపరుస్తున్నదనే యింగిలీషుమాట యీ దినము సత్యముగా తొచినది.

3 తేది వుదాత్పూర్వము 2 గంటలకు మబ్బుచినుకులుగా వున్నా లేచి యిక్కడికి రెండామడదూరములో వుండే మచిలీబందరు అనే షహరు యీ దేశస్థులు పేటా అని చెప్పే బస్తీని 6 గంటలకు ప్రవేశించినాను.*[1] దారి నిన్నటివలెనే యిసుకపర. బండ్లు సాధారణముగా


(వ్రాత ప్రతిపుట 488 లోని అదనపుసంగతి)

  1. * మచిలీబందరు 2 వ తేది మగళ్వారం ఉదయాన దారి యిసకపొర "నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లి అనే తాలూకాకు పని అయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు. మణపాక సాల్వపతినాయిడుగారు నాకు విహితుడు గనుకనున్ను వారు వుభయులూ కలుసుకొని" వీరాస్వామయ్యగారిని వాద్యములతో వూరిలోకి తీసుకొని వెళ్ళి రామన్నపేటలో వక గొప్పతోటయింట్లో బస యేర్పరిచినారు.