పుట:Kasiyatracharitr020670mbp.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వొకపాపి నిమిత్తము వెయ్యింటిని చంప నిచ్చయించడము యుక్తమా అని ప్రశ్నచేసినాడు గనుక గురువు అందుకు మౌనధరుడై యుండేను. కొంతమేర యీశిష్యగురువులు వెళ్ళేలోపలనే సుర్ణ రేఖలు గల వొక సుందరమయిన దక్షిణివర్త శంఖము శిష్యునికి ఆ సముద్రతీర మందు దొరికి నంతలో యెత్తిపూజ్యముగా వక్షస్థలమందు ధరించినాడు. ఆ శంఖములోపల అనేక లక్షల చీమలు శంఖములోని మాంసము భక్షించేకొరకు పుట్టపెట్టి వుండినది. ఆ సమూహములోని ఒక చీమ బయిలువెళ్ళి శిష్యుణ్ణి కరవగానే శిష్యుడు ఆ శంఖముతీసి అందులో చీమల గుంపు చూచి దాన్ని విశిరిపుచ్చి సముద్రములో పడవేసినాడు. యీనడితి గురువుచూచి యేమబ్బా వొకసాఫీనిమిత్తము వెయ్యింటిని యీశ్వరుడు వాడతోకూడ సముద్రములో ముంచినందుకు యీశ్వరుణ్ని దూషించితివే, వొక చీమ నిన్ను కరిచినందుకు అనేకలక్షల చీమలు చచ్చేటట్టు యేల మంచిశంఖమును న్యాయ క్రమ మెరిగిన నీవు సముద్రములో పడవేస్తివని అడిగినాడు.

యీదినము నడిచినదారి దట్టమైన అడివిమధ్యేవున్నది. వెదుళ్లు విస్తారముగా యీఅడివిలోవున్నవి. బురంపూరు మొదలుగా పర్వతసమూహాలు దారికి కుడిపక్క సమీపమందే వున్నవి. జగన్నాధము మొదలుగా భూమి సముద్రతీరమై యిసకైనందున ముంతమామిడి చెట్లు ముంతమామిడిపప్పున్ను ఈ ప్రాంతాల వెశేషముగా కలవు. చెన్నపట్ట్సణము వదిలినవెనక ఈ చెట్లున్ను తమిదె పయిరున్ను చూచిన వాడనుకాను. గంజాం మొదలుగా బురంపురమువరకు భాట పశ్చిమాభిముఖముగా వచ్చి యిచ్చాపురము మొదలు కొండలకిందుగా దక్షిణాభిముఖ మవుచున్నది.

యీదేశములో కర్ణాలు తక్కువజాతివారు. బ్రాహ్మణవేషధారులు వారిని శిష్టుకరణాలంటారు. వేశ్యాస్త్రీలను సాండీ లంటారు. బ్రాహ్మణాగ్రహారప్రవత్రకులను భుక్తు లంటారు. శూద్రగ్రామ ప్రవర్తకులను నీయిం డ్లంటారు. తలారులను చారకు లంటారు. పల్సాళిలో అంగళ్ళు వున్నందున సమస్తపదార్ధాలు దొరికినవి.