పుట:Kasiyatracharitr020670mbp.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిక్కడ వంట, భోజనము కాచేసుకొని యిక్కదికి 7 కోసుల దూరములో నుండే రఘునాధపుర మనే గొప్పవూరు రాత్రి 9 గంటలకు చేరినాను.

దారి వుదయాన నడిచినంత వసతికాదు. అంత దట్టమయిన అడివి ఇరుపక్కల లేదు. కొండలుమాత్రము దారికి సమీపముగా వున్నవి. దారిలో కొత్తాగ్రహార మని వొకవూరు వుండగా దానివద్ద కొంతసేపు ఆసోదా చెసుకొని అక్కడి బ్రాహ్మలను పూజించి సాగివచ్చినాము.

రఘునాధ పురములో యిక్కడి జమీదారుడు వొక గొప్ప గుడి రెండు అంతస్తులుగా కట్టి రాధాకృష్ణులను ప్రతిష్టచేసి పూజ నైవేద్యాలకు వసతులు యేర్పరచి బైరాగుల అధీనము చేసియున్నాడు. బ్రాహ్మల యిండ్లున్నా రాత్రి అయినందున స్థలము విచారించుకోలేక ఆగుడివద్ద దేరాలు వేసుకొని దిగి రాత్రిభోజనాలు మొదలయినవి గడిపినాను. గుడి మహాసుందరముగానేవున్నది. యీవూరిలో సమస్తమయిన పదార్ధాలుకలవు. మా డేరాలవద్ద అంగళ్ళు తెచ్చి వేయించి కావలసిన సామానులు తీసుకొన్నాము.

6 తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే హరిశ్చంద్రపురము పదిగంటలకు చేరినాము. దారిలో కుంఫిణీవారి వేశిన లయను చుట్టు గనుకనున్ను, ఆ లయను మిట్టాపల్లాలుగా వున్నది గనుక, చిన్నగ్రామముల మీద పొయ్యే పూర్వము కలిగివుండే దారే యిప్పటికి నడుస్తూ ప్రసిద్ధి కలిగి వున్నది. అయితే లయనుదారి అనే మాటమాత్రము వొకటి యిక్కడా వినికిడిలోకి వచ్చియున్నది.

ఈవూరు 40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారము. గంజం మొదలుగా బ్రాహ్మలలో వెలనాడు, కాసరనాడు, నియ్యోగు లనే వ్యస్థలు కద్దు. యీ అగ్రహారాల కన్నిఛికి జమీనుదారులు భూవసతులు చేసి వున్నాదు. హరిశ్చంద్రపురములోను అంగళ్ళున్నవి. సమస్త పదార్ధాలు దొరికినవి. బ్రాహ్మణయింట్లో దిగి వంట భోజనములు కాచేసుకొని నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి 3 కోసులదూరములోనుండే నరసన్నపేటవద్దవుంఛే రావులవలస అనే వూరు ఆరుగంటలకు చేరినాము. దారి పొడిచెట్లు అడివి. కాలిబాట రేగడభూమి.