పుట:Kasiyatracharitr020670mbp.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తూ వుంచున్నవి. యిక్కడి నేతగాండ్లను దేవాందులంటారు. యీ దినపుదారిలో వున్న అడివి బలిశివున్నది. బహుశా భూమి నల్లరేగడ. దారిలో మంత్రిరెడ్డి అనే వూరు వున్నది.

4 తేది వుదయ మయిన 5 ఘంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములో వుండే కంతర్ల అనే వూరు 10 గంటలకు చేరినాను. యిక్కడా అయిపోలు (అయిపోలు?) వారు అనే యీ దేశపు వర్తకులు వొక సత్రముకట్టి తటాకప్రతిష్ట, వనప్రతిష్టలు చేసి వొక గోసాయి అధీనము చేసినందున ఆ ధర్మశాలను గోసాయీలు వారి నివాస మఠముగా చేసుకుని అందులో వొక మూర్తిని పెట్టి అరాధన చేయుచూ సత్రానికి వుండే భూస్థితిని తమ అనుభవములోకి తెచ్చుకొని సదావృత్తిని నిలిపివేసి ఆధర్మశాలలో భాటసారులను ప్రవేశించనియ్యకుండా నిర్బంధము పెట్టుతూ వచ్చినారు గనుక యీ జిల్లా శిరస్తా వెంకన్నపంతులు యిక్కడనున్నూ, వేరే ధర్మశాల విశాలముగా కట్టింపుచున్నాడు. యిక్కడవుండే కోమట్లు యిటీవల బందిపోటువల్ల వొచ్చిపోయి విడవలి యిండ్లు బందిపోటువారి దీపారాధనకు అనుకూలముగా మళ్ళీ కట్టుకుని, వచ్చినవారికి కావలసిన సామాను యిస్తూవున్నారు. యీవూళ్ళో గుంటవొడ్డున వంట, భోజనాలు కాచేసుకొని 3 ఘంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే కొత్తపల్లియనే వూరు 4 గంటలకు చేరినాము.

యీ వూరివద్ద మహేంద్రతనయా అనే నది వొకటి వున్నది. యీవూరు బ్రాహ్మణ అగ్రహారము. యిది మొదలుగా వింధ్య దక్షిణదేశమయినందున అవశాత్తుగా గంగా యమునా మధ్యప్రదేశమునుంచి వచ్చిన బ్రాహ్మలను యిక్కడిరాజులు ఆదరించి బ్రాహ్మలు దేవమందిరాలు గల వూరే శ్రేష్టమని అక్కడక్కడ బ్రాహ్మలను ప్రవేశపెట్టుతూవచ్చినందుననున్ను 'యధారాజా తధాప్రజా:'అనే వాక్యప్రకారము ఒక పాటిభూస్వాతంత్ర్యము కలవారుకూడా తమతమవూళ్ళల్లో బ్రాహ్మలకు వసతులు చేసియిచ్చి యిండ్లుకట్టి యిస్తూవచ్చినారు గనుకనున్ను యిదిమొదలుగా కన్యాకుమారి పర్య్హంతము బ్రాహ్మణాగ్రహారాలు చూస్తూ రావచ్చునని తోచినది. కొండమార్గములో గోదావరి