పుట:Kasiyatracharitr020670mbp.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంటలకు బయిలుదేరి యేడు గంటలకు చేరినాను. దారి తెల్లవారి వలెనే వున్నది.

బురంపురము బస్తీవూరు. గంజాంలో మకారత్రయమనే మల్లఛి మార్తా మరాహి అనే జ్వరములవల్లనున్ను కొండపాళెగాండ్ల బందిపోటువల్లనున్ను మరాటీల కొళ్ళగుర్రాలవల్లనున్ను అర్ధములు ప్రాణాలున్ను పోయి బేజారయిన వెనక కలకటరు మొదలయిన ధైర్యము గల యింగిలీషుదొరలు సమేతముగా ఋషికుల్యానది దాటడానకు సందుచిక్కకుండా వలస వచ్చి ఈ బురంపురము ప్రవేశించినారు గనుక అదిమొదలు యీవూరు వొక పటాలముదండు కూడా వుండబట్టి బహు బస్తీ అయివున్నది.

యీవ్చూళ్ళో కొద్దిదినములకు ముందు సర్వతోముఖమనేక్రతువు నడిచి ఆక్రతువు నిమిత్తము నన్ను యెరిగిన గోదావరీతీరపు బ్రాహ్మణమండలి నూటిదాకా యిక్కడ వచ్చివున్నది. ఆ బ్రాహ్మణులందరున్ను శ్రౌతవిషయము బాగా తెలిసినవారు గనుక అధర్వణ వేదము మూలమా లేక కడమ మూడు వీడాలసంగ్రహమా అని నాకు బహుశ: వున్న సందేహము వారివల్ల తీరు నని వారిని విచారించినంతలో సంగ్రహమేనని తీరినది. అందుకు ఆకరము సర్వతోముఖ యాగములో కడమ మూడు వేదాలవలెనే అధర్వణానకు ప్రత్యేల్కాధ్యరము లేదు. పయిగా లోకప్రకటనకు భారద్వాజులు మూడువేదాలే తెచ్చి యీ మూడింటిలోనుంచి అస్త్రప్రయోగ నిమిత్తము మంత్రమగ్రహము చేసిక్షత్రియులకు అధర్వణమని పేరుపెట్టి వొక వేదము చేసియిచ్చినారు. పంచగౌడులలో గాని పంచద్రావిళ్ళలో గాని మేము అధర్వణుల మని చెప్పేవారు యెవరున్ను లేరు.

కలకత్తాలో నుంచి జగన్నాధమువరకు బోయీలకు జనము వొకటింటికి యేడురూపాయలు లెక్కను, బండి వొకటింటికి యిరువై యెనిమిది రూపాయలు లెక్కను తెచ్చి జగన్నాధమునుంచి మళ్ళీ బురంపురమువరకు వేరేబోయీలను, కావడివాండ్లను జనము వొకటింటికి ర్పు2 (2-4-0) వంతున బండి 1 కి 7 ర్పు లెక్కనిష్కర్షచేసి తెచ్చి నాను గనుక వారికి యివ్వవలసినది తీర్చియిచ్చి వేరేబోయాలను,