పుట:Kasiyatracharitr020670mbp.pdf/360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధరించివున్నారు. సమీపమున వుండే మాలుఝూ అనేవూరిలో యెవరికి రాని తెనుభాష యిక్కడ అందరికి వచ్చివున్నది.

జూలాయినెల 1 తేదీ వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి 4 కోసుల దూరములోవుండే నాయడిపేట అనేవూరు యేడుగంటలకు చేరినాను. యీ దినము దారి మదరాసు గౌర్నమెంటువారి హుకుము లోబడ్డభూమిలోది గనకనున్ను యీ గౌర్నమెంటువారి యోచన లగాయతునుంచి హిందువులను చలిపురుగులకు సములనే అగౌరవబుద్ధితొ ఆత్మార్ధమైన పనులలో సర్వకృషిచేసి పరార్ధమైన పనులుమాత్రము యీశ్వరాధీనముచేసి వుండడము సహజము గనుకనున్ను కలకత్తా గౌర్నమెంటువారి వలెనే లోకోపకారమైన దారులను గురించి సడక్కువేశే ప్రయాస వీరు విశేషము పుచ్చుకోకుండా వున్నందున యశోవిలాసముగా అడివి యీజిల్లాలొ బలిసివున్నది గనుక ఆ అడివిలో సూటిగా లయనువేసి నూరడుగుల వెడల్పుకు అడివికొట్టి శాలచెట్లు పెట్టినారు. ఆ చెట్లుమాత్రము అక్కడక్కడ వొకటొకటి జీవించివున్నది. భూమిని చదరంగానైనా చేసినవారుకారు గనుక లయనుకు చుట్టూవుండే చదరపు భూమిని వెతుక్కుని దారినడిచేవారు తాము దారులు కలగజేసుకుని నడుస్తూ వున్నారు.

యా దినమంతా భాట అడివి దారిలో చత్రపురమనే వూళ్ళో కలటరు స్థలవసతినిమిత్తము వసింపుచున్నాడు.*[1]

యీనాయుడిపేట యనే వూరు అడివిమధ్యే వున్నది. ఆవూరి వద్ద అడివికొట్టి బందా చలమయ్య యనే కోమటి వొక డాబా కట్టించి గుంటబావి తొవ్వించినాడు. వొక అంగటివాడు వున్నాడు. అక్కడ పదార్ధాలు మృగ్యముగా దొరికినవి. అక్కడ భోజనము కాచేసుకుని అక్కడికి మూడుకోసులదూరములో వుండే బురంపురమనే బస్తీ నాలుగు

  1. * అరణ్యమార్గంగా చత్రపురానికి ప్రయాణము కలకటరుకచేరీలో ట్రాంసులేటరుగా వుండే కపిల రామదాసు పంతులుగారికి నేను ఒక వుత్తరంద్వారవ్రాసి వున్నంతలో ఆయన 40 కావళ్ళ 2 డలాయతులు ఒక గుమాస్తాను పంపి అరణ్యమార్గం సుళువు చేయించినాడు.(చూ. వ్రాతప్రతి పుట 419)