పుట:Kasiyatracharitr020670mbp.pdf/357

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వున్నది. ఆ తురక యీనదిలొ పడవలను పురుగులు తూట్లుపడేటట్లుగా తినివేస్తున్నవని నలుగు యెక్కేపాటి వొంటికొయ్య దోనెలు నాలుగయిదు చెయించివున్నాడు. మనిషికి అణా 1 బండికి ర్పు 4 (0-8-0) గుఱ్ఱానికి ర్పు 1 (0-4-0) యీలాగు కూలితీసుకుని దాటింపుచున్నాడు. ఆ చిన్నదోనెలతో నా పరిజనము నూరుమందిన్ని, మూడుబండ్లున్ను, మూడు సవరీలున్ను దాటను అక్కడనే వుదయమయిన 7 గంటలదాకా పట్టేను. నాకు సర్కారుకుమ్మక్కు వున్నందున అంత త్వరగా దాటినాను. సాధారణమైనవారు రెండు మూడుదినాలు కాచివుండవలెను.

యీ మిఠాగువ్వలో వుప్పుకొఠారులు వున్నది గనుక వాటి అధికారస్థులు ఇండ్లుకట్టుకుని వున్నారు. జాగీరుదరుడు కట్టించిన డాబా సముద్రపు యిసుక పెట్టి పూడిపోయినది. యిప్పుడు త్రొవ్వి బయటికితీసినా దిగను వసతిగావుండలేదు. వొక్కమర్రిచెట్టు తప్ప వెరే చెట్టునీడకూడా లేదు. వొక్కటే అంగడి వున్నందున అక్కడ వొక బావివొడ్డున చెట్టునీడలో వంటభోజనము కాఛెసుకుని 2 గంటలకు బయిలుదేరి రాత్రి ఆరు గంటలకు యిక్కడికి ఆరుకోసులదూరములో వుండే మాలుఝూ అనేవూరు చేరినాము.

యిక్కడ జాగీరుదారుడు కట్టిన డాబా పనికిరాక వున్నది. వూరు పెద్దది అయినప్పటికి యాత్రవాండ్లు దిగడానకు స్థలము లేదు. వూరిముందర వొక పెద్ద వటవృక్షమున్ను అమృతతుల్యమైన జలము గలిగి మంచివూటగల బావి వొకటిన్ని వుండగా వాటివద్ద డేరాలు వేశి దిగినాను. యిక్కడ పోలీసు జమేదారుడు వుండే స్థలము గనుక తాత్రిపారాచౌకీ యివ్వడానకు నలుగురు చౌకీదార్లను పంపించినాడు.

కలకత్తా మొదలుగా ప్రతిగ్రామములోనున్ను దక్షిణదేశములోని తలారులు వలెనే యిక్కడ నాయకు లని కొందరు వుంటారు. యిదిన్నిగాక చౌకీదార్లని సరకారువారు యేర్పరచిన వారు కొందరు ప్రతివూరికి వుంటారు. అందరున్ను పోలీసు నౌకరుల అధీనమయి వుంటారు. ఈ మాలుఝూ అనే వూళ్ళో 10 అంగళ్ళదాకా వున్నవి. సమస్త పదార్ధాలు దొరుకును. నేటిదారి చిలక సముద్రము